ఆయన కెమెరా లో ఏదో మాయ ఉంది..

Divya

సినీ ఇండస్ట్రీలో ఒక సినిమాను  కెమెరామేన్ ఎంత అందంగా చూపిస్తే , అంత అందంగా సినిమా వస్తుంది. అంతే కాకుండా పిక్చర్ క్వాలిటీ  విషయంలో కూడా చాలా జాగ్రత్త వహిస్తుంటారు డైరెక్టర్లు. అయితే ఈ కెమెరా లో ఏదో మాయ ఉందంటున్న పీ సీ శ్రీరామ్ గారు.. అదేంటో  తన మాటల్లోనే విందాం.

పీ సీ శ్రీరామ్..చూడటానికి చాలా సీరియస్ గా ఉంటాడు. అలా ఉంటే ఆయనకు  కోపం ఎక్కువ అనుకుంటున్నారా..?అలా అనుకునే వారు కూడా ఉన్నారు. కానీ ఆయన అంతే. కానీ ఆయన కెమెరా మాత్రం ఎప్పుడూ చల్లగానే ఉంటుంది. అందుకు బదులుగా అందాల్ని బంధిస్తూ బిజీగా ఉంటుంది. మేము చెప్పేది సినిమాలు చిత్రీకరించడానికి ఉపయోగించే కెమెరా గురించి కాదు. ఫోటోలు తీసే కెమెరా గురించి..

పీ సీ  శ్రీరామ్  ఎంత మంచి సినిమాటోగ్రాఫర్, అంతే మంచి ఈ ఫోటో గ్రాఫర్ అని కూడా చెప్పవచ్చు. దానికి ఆయన తీసిన ఫోటోలే రుజువు. తాజాగా కొంత మంది స్టార్ హీరోలు,స్టార్ హీరోయిన్ల  ఫోటోలు సోషల్ మీడియా లో సందడి చేస్తున్నాయి. ఈయన ప్రస్తుతం "థ్యాంక్ యు"అనే సినిమాలో పని చేస్తున్నాడు. విక్రమ్ కె కుమార్ ,నాగచైతన్య కాంబోలో రూపొందుతున్న ఈ చిత్రం, చిత్రీకరణ ఇప్పుడు మిలన్ లో జరుగుతోంది.

అయితే ఈ సందర్భంగా ఆయన తీసిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలో ఉన్నది నాగ చైతన్య,  రాశి ఖన్నా, అవికా గోర్.అయితే ఈ ఫోటోలు కేవలం మొబైల్ ఫోన్ లో తీసినవే అని తెలుస్తోంది. ఏ కెమెరా అయితేనేమి ఆయన చేతిలో ఏదో మాయ ఉంటేనే అంత అద్భుతంగా ఫోటోలు వస్తాయి అని అంటున్నారు నెటిజన్లు.

పీ సీ శ్రీరామ్ యొక్క ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ ఓపెన్ చే,స్తే ఆ ఇంట్రెస్టింగ్ ఫోటోలు మీరూ చూడవచ్చు. అందులో రాశి ఖన్నా అందమైన కళ్ళు, అవికా గోర్ చిరు చీకటిలో ఉన్న అందమైన ఈ ఫోటోలు  మీకు కనిపిస్తాయి. ఇప్పుడు ఈ ఫోటో లు నెట్టింట వైరల్ గా మారాయి. ఏదిఏమైనా కేవలం మొబైల్ ఫోన్ లోనే ఇంత అద్భుతంగా ఫోటోలు తీయడం పీసీ శ్రీరామ్ కే చెల్లు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: