తన భర్తకు స్పెషల్ విషెష్ చెప్పిన మంజుల ఘట్టమనేని !

Divya

మంజుల ఘట్టమనేని.. ఈమె కేవలం నటి మాత్రమే కాదు నిర్మాత కూడా.. మంజుల, కృష్ణ ఘట్టమనేని, ఆయన మొదటి భార్య ఇందిరా లకు పుట్టిన మూడవ సంతానం. మంజుల ముఖ్యంగా తెలుగులో అనేక సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఈమె నటిగా 1999లో తమిళంలో వచ్చిన" రాజస్థాన్" అనే సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయింది. ఇక అంతకుముందే 1998లో "సమ్మర్ ఇన్ బెత్లెహెం" అనే మలయాళం  సినిమాలో కథానాయకురాలిగా నటించారు. 2002 లో "షో" సినిమా లో అద్భుతంగా నటించి, అందరి మన్ననలను పొందింది. ఇక ఈ చిత్రానికి  గానూ మంజులకు జాతీయ స్థాయి ఉత్తమ చిత్రం  ,ఉత్తమ స్క్రీన్‌ప్లే పురస్కారాలు కూడా దక్కాయి. ఈమె తన సొంత ప్రొడక్షన్ సంస్థ  అయిన ఇందిరా ప్రొడక్షన్స్ ద్వారా సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తోంది. అలాగే పలు సినిమాలకు ఉత్తమ నిర్మాతగా నంది అవార్డులు కూడా పొందింది.
ఇదిలా ఉండగా, ఈమె  తన సహనటుడు అయిన సంజయ్ స్వరూప్ ను ప్రేమించి, పెళ్లి చేసుకుంది. ఇక ఏప్రిల్ 30 వ తేదీన తన భర్త  పుట్టినరోజు సందర్భంగా ఆమె తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తన భర్తకు స్పెషల్ విషెష్ ను తెలిపింది.. ఇక తన ట్విట్టర్ లో " పుట్టిన రోజు శుభాకాంక్షలు ప్రియతమా.. సమతుల్యత అలాగే  స్థిరత్వాన్ని నా జీవితంలో  తీసుకొస్తున్న మీరు చాలా గ్రేట్" అంటూ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపింది..

ఇక తన భర్త సంజయ్ స్వరూప్ కూడా పలు చిత్రాలలో నటుడిగా వ్యవహరించాడు. సంజయ్ స్వరూప్ నటుడిగా, నిర్మాతగా తెలుగు చిత్రాలతో పాటు పలు హిందీ చిత్రాలకు కూడా వ్యవహరిస్తున్నాడు. సంజయ్ స్వరూప్ నటుడిగా, నిర్మాతగా తెలుగులో మహేష్ బాబు నటించిన 2004వ సంవత్సరంలో వచ్చిన "నాని" సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఇక అంతేకాకుండా సహాయకుడు పాత్రలో ఇరవై చిత్రాలకుపైగా నటించి, ప్రేక్షకుల ఆదరణ పొందాడు.

అలాగే 2010వ సంవత్సరంలో నాగచైతన్య , సమంత కలిసి సంయుక్తంగా నటించిన "ఏ మాయ చేసావే " సినిమా ద్వారా సంజయ్ స్వరూప్ , మంజుల ఘట్టమనేని ఇద్దరూ నిర్మాతలుగా వ్యవహరించారు
 అంతేకాకుండా ఈ సినిమాలో ఒక మంచి పాత్రలో నటించాడు సంజయ్ స్వరూప్. ఇక ఈ చిత్రం ఎంత గొప్ప విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిత్రం తర్వాత నాగచైతన్య ,సమంత లు వివాహం కూడా చేసుకున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: