రాజమౌళి అలోచనలలో త్రివిక్రమ్ అడుగులు !
మహేష్ బాబు రాజమౌళిల కాంబినేషన్ మూవీకి సంబంధించిన వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ విడుదల తరువాత ఈమూవీ మొదలవుతుందని ఇప్పటికే రాజమౌళి అనేకసార్లు లీకులు ఇచ్చుకుంటూ వచ్చాడు. ఈమూవీ కథ ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో మహేష్ ను ఒక ఇంటర్ నేషనల్ స్పై పాత్రలో చూపించే విధంగా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈమూవీ కథను ఇప్పటికే పూర్తి చేసాడు అన్న వార్తలు కూడ వచ్చాయి.
దీనితో రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు జేమ్స్ బాండ్ తరహా పాత్రలో ఎలా ఉంటాడు అన్న ఊహలలో ఇప్పటికే మహేష్ అభిమానులు ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్ ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తోంది. లేటెస్ట్ గా ఫైనల్ అయిన మహేష్ త్రివిక్రమ్ ల మూవీ కథలో కూడ మహేష్ ఒక సీక్రెట్ ఏజెంట్ గా కనిపిస్తాడని లీకులు వస్తున్నాయి.
వాస్తవానికి ఈమూవీ కథను ముందుగా త్రివిక్రమ్ జూనియర్ ఎన్టీఆర్ కు చెప్పాడని జూనియర్ కు కూడ ఈకథ బాగా నచ్చినప్పటికీ తారక్ ఫ్యామిలీ ఎమోషన్స్ కథ వైపు మొగ్గు చూపడంతో ఇప్పుడు ఆ కథ మహేష్ వైపు వచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఈవార్తలే నిజం అయితే రాజమౌళి మహేష్ ల మూవీ ప్రాజెక్ట్ జేమ్స్ బాండ్ కథ మారవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. దీనితో అటు రాజమౌళి ఇటు త్రివిక్రమ్ ఒకే రకం కథలను అనుకోకుండా ఆలోచనలు చేసారా అన్న సందేహాలు వస్తున్నాయి.
మహేష్ త్రివిక్రమ్ ల మూవీ కథకు సంబంధించిన లీకులు బయటకు రావడంతో ఇప్పుడు రాజమౌళి మహేష్ తో తీయబోయే మూవీ కథకు సంబంధించి కూడ మార్పులు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది అని అంటున్నారు. ఈమధ్య కాలంలో త్రివిక్రమ్ ఏకథ వ్రాసినా ఎదో ఒక కథకు స్ఫూర్తి అంటూ వార్తలు రావడం సర్వసాధారణం అయిపోయింది. ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు త్రివిక్రమ్ ఆలోచనలకు రాజమౌళి స్పూర్తిగా మారడం కొంతవరకు ఆశ్చర్య పరిచే నిజం..