ఎక్కువ సినిమాలు అందుకే చెయ్యట్లేదు : ఇలియానా
ఇక అదే సమయంలో బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ కావడం ఆ తర్వాత డిప్రెషన్ లోకి వెళ్లి పోవడం జరిగింది. ఇకపోతే ఎప్పుడూ సన్నజాజుల నడుము ఒంపు అందాలతో అందరిని ఆకట్టుకునే ఇలియానా ప్రస్తుతం బొందు మల్లెల బొద్దుగా మారిపోయింది. ఇక తన హిట్ పెయిర్ అయిన రవితేజతో కలిసి మళ్లీ తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ అభిమానుల నుంచి మాత్రం ఆదరణ కరువైంది. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఇలియానా దాదాపు కనుమరుగు అయ్యింది అని చెప్పాలి. ఇక అటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అడపా దడపా అవకాశాలు దక్కించుకుంటుంది కానీ ఎక్కువ సినిమాలు చేయడం లేదు ఈ ముద్దుగుమ్మ. అయితే తాజాగా తాను ఎందుకు ఎక్కువ సినిమాలు చేయడం లేదు అనే విషయంపై క్లారిటీ ఇచ్చింది.
ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు పాత్రల ఎంపికలో తన విధానం పూర్తిగా మారిపోయిందని చెప్పుకొచ్చింది గోవా బ్యూటీ ఇలియానా. ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు ఎన్ని మంచి సినిమాలు చేశాము.. ఆ సినిమాలో తన పాత్ర ఎలా ఉన్నది ముఖ్యం అంటూ భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. అందుకే ప్రస్తుతం తక్కువ సినిమాలు చేస్తున్నాను అని తెలిపింది. కాగా ప్రస్తుతం ఇలియానా నటించిన అన్ ఫెయిర్ అండ్ లవ్లీ అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మరి ఈ సినిమా అయినా ఈ అమ్మడి కెరీర్ నిలబెడుతుందో లేదో అన్నది చూడాలి మరి.