అనీల్ రావిపూడి ని కన్ఫ్యూజ్ చేస్తున్న ఆ ముగ్గురు హీరోలు !
ప్రస్తుతం అనీల్ రావిపూడి తీస్తున్న ‘ఎఫ్ 3’ షూటింగ్ ఇంచుమించు పూర్తి అయింది. దీనితో మరో టాప్ హీరోతో సినిమా చేయాలని అనీల్ రావిపూడి ఈ కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులలో కూడ తన ప్రయత్నాలు వేగంగానే కొనసాగిస్తున్నాడు.
వాస్తవానికి మహేష్ అనీల్ రావిపూడి తో మరొక సినిమా చేయడానికి ఇప్పటికే సిద్ధంగా ఉన్నాడు. అయితే త్రివిక్రమ్ తో చేయబోయే మూవీ తరువాత తన మూవీ ఉంటుందని ఇప్పటికే సంకేతాలు ఇచ్చాడు అని అంటారు. దీనితో అనీల్ రావిపూడి యూటర్న్ తీసుకుని బాలకృష్ణ వైపు వెళితే అతడు అనీల్ తో సినిమా చేయడానికి ఆశక్తి కనపరుస్తూనే ఇప్పటికే తాను కమిట్ అయిన గోపీ చంద్ మలినేని మూవీ పూర్తి అయిన తరువాత తాను అనీల్ రావిపూడి ప్రాజెక్ట్ వైపు వస్తాను అని చెప్పినట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితులలో రవితేజా తో ‘రాజా ది గ్రేట్’ సీక్వెల్ తీయాలని లేటెస్ట్ గా అనీల్ రాయబారాలు మొదలుపెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే రవితేజా మాత్రం తాను ఇప్పటికే లైన్ లో పెట్టిన మూడు సినిమాలు పూర్తి అయ్యే వరకు అనీల్ ను ఎదురు చూడమని చెప్పినట్లు తెలుస్తోంది. దీనితో ‘ఎఫ్ 3’ పూర్తి అయ్యాక తాను ఏ హీరోతో చేయాలో ఫైనల్ కాకుండా స్క్రిప్ట్ తయారు చేసి ప్రయోజనం ఏమిటి అని అంతర్మధనంలో అనీల్ రావిపూడి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో టాప్ హీరోలు అంతా ఈ క్రేజీ దర్శకుడుతో నటించే ఆశక్తి కనపరుస్తున్నా ప్రస్తుతానికి ఎవర్నీ ఫైనల్ చేసుకోలేని కన్ఫ్యూజ్ లో ఈ దర్శకుడు ఉన్నాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి..