అనుకోకుండా ఆగిపోయిన 8 సినిమాలు ?

Divya

సినీ ఇండస్ట్రీలో కొన్ని సార్లు అనుకున్నటువంటి కాంబినేషన్స్ వర్కౌట్ కావు.అయితే కొన్ని ఓకే అయిన తర్వాత ఒక్కోసారి అనుకోని కారణాల చేత ఆగిపోతున్నాయి. అలా టాలీవుడ్ లో 20 సినిమాలకు పైగా ఆగిపోయాయి. వాటిలో ఇక్కడ కొన్ని సినిమాల వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం.


1). ఎన్టీఆర్-త్రివిక్రమ్: వీరిద్దరి కాంబినేషన్లో  అరవింద సమేత సినిమా వచ్చింది. అది వచ్చిన తర్వాత రెండోసారి మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సినిమా ప్రకటించారు త్రివిక్రమ్. ఈ సినిమా పేరు "అయినను పోయిరావలె హస్తినకు" పేరుతో పొలిటికల్ థ్రిల్లర్ గా వస్తుంది అనుకున్నారు. అయితే ఈ సినిమా బదులుగా కొరటాల శివతో  కమిట్ అయ్యాడు. కేవలం కథ లేకపోవడం వల్లే త్రివిక్రమ్ సినిమా ఆగిపోయిందని ప్రచారం.




2). రామ్ చరణ్-కొరటాల శివ: మిర్చి లాంటి బ్లాక్ బాస్టర్ సినిమా తర్వాత కొరటాల శివ తో సినిమా చేయడానికి చాలామంది హీరోలు క్యూ కట్టారు. అయితే గోవిందుడు అందరివాడేలే సినిమా తరువాత రామ్ చరణ్, కొరటాల శివ సినిమా ఉంటుందనుకున్నారు. అయితే కొరటాల శివ తో సినిమా చేయడానికి ఓపెనింగ్ కూడా అయింది. ముహూర్తం కూడా జరుపుకున్న తర్వాత కథలో కొన్ని మార్పులు వల్ల సినిమా పూర్తిగా నిలిపివేశారు.



3). పవన్ కళ్యాణ్-సంపత్ నంది : గబ్బర్ సింగ్ 2 సినిమాకు ముందు పవన్ కళ్యాణ్, సంపత్ నంది దర్శకత్వంలో చేయాలనుకున్నా,చివరికది బాబి చేతుల్లోకి వెళ్ళిపోయింది.



4). చిరంజీవి-ఆర్జీవి: చిరంజీవితో రాంగోపాల్ వర్మ" వినాలని ఉంది" సినిమాను కొంత షూటింగ్ చేశాడు. ఆ తర్వాత బాలీవుడ్ ఆఫర్ వచ్చిందని ఆర్జీవీ వెళ్ళిపోయాడు.



5). రామ్ చరణ్ - ధరణి: మగధీర సక్సెస్ తర్వాత రామ్ చరణ్ ఆరెంజ్ సినిమా తీయడంతో, అది భారీ ఫ్లాప్ ను చవి చూసింది. అయితే తమిళ దర్శకుడు ధరణి, రామ్ చరణ్  కాంబినేషన్ లో మెరుపు సినిమా తీయాలనుకున్నారు. ఇందులో హీరోయిన్ గా కాజల్ ని ఫిక్స్ చేశారు. మరియు పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. అయితే ఏమైందో తెలియదు గానీ ఆ తర్వాత సంపత్ నంది తో రచ్చ సినిమా చేశాడు రామ్ చరణ్.


6). పవన్ కళ్యాణ్ - ఎస్.జె.సూర్య : ఖుషి, కొమరం పులి లాంటి సినిమాలు డైరెక్ట్ చేసిన ఎస్.జె.సూర్య  తో మరొక మూవీ చేయాలనుకున్నాడు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో సినిమాను కూడా మొదలు పెట్టారు. తమిళంలో"వీరమ్"  సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకున్నారు. అప్పట్లో ముహూర్తం జరుపుకున్న తర్వాత ఈ సినిమా ఆపేశాడు పవన్ కళ్యాణ్. అదే సినిమాని డాలి, కాటమరాయుడు పేరుతో తెరకెక్కించారు.



7). మహేష్ బాబు-వంశీ పైడిపల్లి : మహేష్ బాబు మహర్షి సినిమా ఎంత పేరు తెచ్చిందో మనకు తెలిసిన విషయమే. అయితే ఆ సినిమా తర్వాత మరో సినిమా ఉంటుందని వంశీ పైడిపల్లి అనౌన్స్ చేశారు. అయితే చివరి నిమిషంలో ఆయన కాదని, పరశురాం తో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు.



8). చిరంజీవి-పూరి జగన్నాథ్: చిరంజీవి రీ ఎంట్రీ ఇవ్వాలనుకున్నప్పుడు చాలా కథలు విన్నాడు. తెలుగులోనే అగ్ర దర్శకులు సైతం చిరంజీవి సినిమా  చేయడానికి పోటీ పడ్డారు. అలాంటి సమయంలోనే ఆటోజానీ అంటూ అదిరిపోయే కథ వినిపించాడు పూరి జగన్నాథ్. కథ వినగానే పూర్తిగా ఎగ్జైట్మెంట్ అయి 150 సినిమా ఆయనతోనే అనౌన్స్ చేశారు. అయితే సెకండాఫ్ స్క్రీన్ సరిగ్గా రాలేదని అందుకే ఆ సినిమా ఆపేస్తున్నామని చెప్పారు చిరంజీవి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: