అనవసరపు ప్రయోగాలలో తల దూరుస్తున్న శివ నిర్వాణ !
కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు అడ్డు తగలకుండా ఉండి ఉంటే ఈ మూవీ ఈ పాటికి విడుదల అయి ఉండేది. ఈ మూవీని ఇప్పటికే చూసిన కొందరు ఇండస్ట్రీ ప్రముఖులు ఫీల్ గుడ్ మూవీగా తీయబడ్డ ఈ మూవీలోని సన్నివేశాలు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతాయని అంటున్నారు. ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ నుండి మంచి ఆఫర్లు వస్తున్నా వాటికి ఆశ పడకుండా సెకండ్ వేవ్ కంట్రోల్ అయ్యాక తిరిగి ధియేటర్లలోకి రావడానికే ‘టక్ జగదీష్’ ఆశక్తి కనపరుస్తోంది.
ఈ సినిమాకు సంబంధించిన ఒక షాకింగ్ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల ద్వారా లీక్ అయింది. ఈ మూవీలో ఒక మాస్ మసాలా ఐటమ్ సాంగ్ ఉందట. ఈ పాటను ఒక క్రేజీ గ్లామర్ బ్యూటీ పై ఇప్పటికే షూట్ చేసారని టాక్. అయితే ఈ మూవీలో ఐటమ్ సాంగ్ ఉన్న విషయాన్ని రిలీజ్ సమయం వరకు రహస్యంగా ఉంచాలని శివ నిర్వాణ భావించడంతో ఈవిషయం బయటపడలేదు అని అంటున్నారు.
ఇప్పుడు ఈ న్యూస్ ఇండస్ట్రీ వర్గాలలో షాకింగ్ న్యూస్ గా మారింది. శివ నిర్వాణ లాంటి మంచి సెన్సిబుల్ డైరెక్టర్స్ కూడ ఇలా ఐటమ్ సాంగ్స్ పెట్టుకుంటూ పోతే ఈ కల్చర్ నుండి ఇండస్ట్రీని రక్షించే వ్యక్తులు ఎవరు అంటు కామెంట్స్ వస్తున్నాయి. అంతేకాదు మరికొందరైతే కుటుంబ బంధాల నేపధ్యంలో సినిమాలు తీసే శివ నిర్వాణ తాను మాస్ సినిమాలను తీయగలను అని నిరూపించుకోవడానికి ఇలాంటి ఐటమ్ సాంగ్ ప్రయోగం చేసినా అది వికటించే ఆస్కారం ఉంది అని హెచ్చరిస్తున్నారు..