వీరిద్దరిదీ టాలీవుడ్ లో సూపర్ హిట్ కాంబినేషన్ !
వీరిద్దరి కలయికలో వచ్చిన మొదటి చిత్రం ‘మనుషులంతా ఒక్కటే’ .
ఈ సినిమాలో రామారావు గారి పాత్రతో మానవత్వ విలువలను చాటి చెప్పి అందరి హృదయాలను కదిలించాడు దాసరి నారాయణ రావు. వీరి కాంబోలో వచ్చిన రెండో చిత్రం ‘సర్కస్ రాముడు’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను అందుకుంది. వీరి కలయికలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం ‘సర్ధార్ పాపారాయుడు’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వీరి కాంబినేషన్ లో వచ్చిన మరో చిత్రం 'సర్దార్ పాపారాయుడు'.
స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ పాపన్న గౌడ్ జీవిత చరిత్రను ఆధారం చేసుకుని దర్శకరత్న దాసరి నారాయణరావు ఈ చిత్రాన్ని తెరకెక్కించగా ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఆ తర్వాత వీరి నుండి 'విశ్వరూపం' చిత్రం వచ్చింది.. కానీ ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది.
నందమూరి తారక రామారావు దాసరితో చేసిన బొబ్బిలి పులి సినిమా ఒక సంచలనం. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ జీవితంలో మరో చాప్టర్ మొదలైందని చెప్పాలి. ఈ చిత్రం తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసి నాయకుడిగా ప్రజలకు మరింత చేరువయ్యారు. ప్రజల అండతో ముఖ్యమంత్రిగా ఎన్నికై ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించారు. ఈ విధంగా దివంగత నటుడు దర్శకుడు దాసరి నారాయణరావు స్వర్గీయ నందమూరి తారకరామారావుతో చేసిన సినిమాలు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఈ రోజు దాసరి పుట్టినరోజు కారణంగా ఈ విషయాలను మరో సారి మనము గుర్తు చేసుకోవడం మన అదృష్టంగా భావించాలి.