ఫ్లాప్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన యూత్ స్టార్ హీరో..
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ లు తమ మొదటి సినిమాతోనే హిట్ ను అందుకుంటే, స్టార్ హీరోలు సైతం ఆ డైరెక్టర్లు చెప్పే కథలను వినడానికి ముందుకొస్తారు. అదే ఆ డైరెక్టర్ తన మొదటి సినిమాతో ఫ్లాప్ కొడితే, కనీసం ఆ డైరెక్టర్ కథలను యంగ్ హీరోలు కూడా వినడానికి ఒప్పుకోరు. అయితే ఇలాంటి కోవకు చెందినవాడు వక్కంతం వంశీ కూడా. సరిగ్గా మూడేళ్ల క్రితం వక్కంతం వంశీ డైరెక్షన్లో తెరకెక్కిన" నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా " చిత్రం విడుదలైంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ చిత్రం పర్వాలేదనిపించినా, కమర్షియల్ గా బాక్సాఫీసు వద్ద సక్సెస్ కాలేకపోయింది.
ఇక అంతకు ముందు ఎన్నో హిట్ సినిమాలకు రైటర్ గా వక్కంతం వంశీ పని చేయడం వల్ల, ఇతనిని డైరెక్టర్ గా లాంచ్ చేయడానికి చాలామంది నిర్మాతలు ముందుకు వచ్చారు. కానీ ఇతని సినిమా మొదటి ఫలితం తోనే తేడా కొట్టడంతో, ఇక వాళ్ళు కూడా తప్పుకోవాల్సి వచ్చింది. పట్టువదలని విక్రమార్కుడిలా వంశీ చాలామంది స్టార్ హీరోలను అప్రోచ్ అయ్యాడు. కానీ అతనిని నమ్మి నటించడానికి ఎవరూ ముందుకు రాలేదు. అయితే ఇప్పుడు ఓ మీడియం రేంజ్ హీరో వంశీ కి ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే, యూత్ స్టార్ నితిన్ "అంధాదున్" రీమేక్ తర్వాత వక్కంతం వంశీ డైరెక్షన్లో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
భీష్మ తర్వాత నితిన్ నటించిన చెక్ మూవీ డిజాస్టర్ కాగా, ఇక రంగ్ దే మూవీ కూడా డిజాస్టర్ గా నిలిచింది. ఇక దాంతో నితిన్ తన నెక్స్ట్ ప్రాజెక్టుల విషయంలో జాగ్రత్త పడాలని డిసైడ్ అయ్యాడు. ఇక ఇప్పటికే కృష్ణచైతన్య డైరెక్షన్లో చేయాల్సిన పవర్ పేట ప్రాజెక్టుని పక్కనపెట్టాడు. దీని ప్లేస్ లో వక్కంతం వంశీ డైరెక్షన్లో ఒక యూత్ ఫుల్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను చేయాలని డిసైడ్ అయినట్లు తాజా సమాచారం. ఇకనైనా డైరెక్టర్ గా వంశీ, అటు స్టార్ హీరోగా నితిన్ నిరూపించుకుంటారో లేదో చూడాలి మరి..