హఠాత్తుగా సీరియల్స్ నుంచి మధ్యలోనే తప్పుకున్న నటీ నటులు !
సాధారణంగా బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియల్స్ లో ఏకధాటిగా నటించడం అంటే అంత ఆషామాషీ కాదు. ఎందుకంటే ఒకే పాత్రలో లీనమైపోయి సంవత్సరాల తరబడి నటించాల్సి ఉంటుంది. వారికి ఎన్ని పనులు ఉన్నా, ఎంత సమస్య వచ్చినా వాటన్నింటినీ పక్కన పెట్టి మరీ సీరియల్స్ లో నటిస్తూ ఉంటారు మన నటీనటులు. అయితే ఇలాంటి వారు ఎంత కష్ట పడుతున్నారో చెప్పడం అంత సులభమేమీ కాదు. కానీ అనుకోకుండా ఒక్కొక్కసారి హఠాత్తుగా కొన్ని కొన్ని కారణాల చేత సీరియల్స్ నుంచి తప్పుకోవడం జరుగుతుంది.. ఈ విషయాన్ని మనం కూడా గమనించే ఉంటాం.. అయితే ఎవరెవరు సీరియల్స్ ఏంటి సడన్ గా తప్పుకున్నారో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..
గత రెండు సంవత్సరాల నుంచి కరోనా ఉద్ధృతి రోజు రోజుకి పెరిగిపోవడంతో, ఒక్కసారిగా దీని దెబ్బకు ఇండస్ట్రీలో చాలా ఒడిదుడుకులు వస్తున్నాయి. ఈ కరోనా కారణంగా గత కొన్ని నెలలపాటు ఈ సీరియల్స్ బుల్లితెరపై ఆగిపోయిన విషయం కూడా తెలిసిందే. ఇక కరోనా ఫస్ట్ వేవ్ కారణంగా ఆగిపోయిన సీరియల్స్, మరీ కరోనా తగ్గుముఖం పట్టడంతో మళ్లీ ప్రసారం అవ్వడం మొదలయ్యాయి. కానీ ఇప్పుడు మరోసారి ఈ సీరియల్స్ కు అంతరాయం కలిగే రోజులు రానున్నాయని పలు సీరియల్ ప్రముఖులు పేర్కొన్నారు.
ఇక కొన్ని పాపులర్ సీరియల్స్ నుంచి కొంత మంది హీరో హీరోయిన్స్ అలాగే నటులు తప్పుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్ లో హీరోగా నటిస్తున్న చందన కుమార్ అనుకోని కారణాల చేత తప్పుకోవాల్సి వచ్చింది.. ఇక స్టార్ మా లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ లో శివ పార్వతి కూడా కొన్ని కారణాల చేత తప్పుకున్నారు..
ఇక ఈటీవీలో ప్రసారమవుతున్న యమలీల సీరియల్ లో వజ్రా కూతురు గా నటిస్తున్న వైజూష కి ముందు మహేశ్వరి నటించి, ఆమె కూడా తప్పుకుంది. ప్రస్తుతం జీ తెలుగు లో ప్రసారం అవుతున్న కల్యాణ వైభోగమే సీరియల్ లో హీరోగా నటించిన సన్నీ కూడా సడన్ గా తప్పుకున్నాడు. అలాగే అత్తారింట్లో అక్క చెల్లెలు సీరియల్ లో కూడా చైత్ర రాయ్ హీరోయిన్ గా నటిస్తూ తప్పుకుంది. ఇక ఇంటిగుట్టు సీరియల్ లో నటిస్తున్న రోహిత్ రంగస్వామి సీరియల్ నుంచి తప్పుకున్నాడు.
బంగారు పంజరం హీరో రాజన్ విన్సెంట్ నటించిన విషయం తెలిసిందే. అయితే ఆయన్ని కూడా మార్చేశారు.ఇక ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నటించిన మానస పాత్రలో నటిస్తున్న వర్ష కరోనా సోకడంతో ఈ పాత్రలో ఎవరు నటిస్తారనే చర్చ మొదలైంది. ఇక స్టార్ మా లో ప్రసారం అవుతున్న కేరాఫ్ అనసూయ సీరియల్ లో నటిస్తున్న హీరో ప్రజ్వల రవి హఠాత్తుగా తప్పుకున్నాడు.. వీరంతా కూడా అనుకోని కారణాల చేత తాము నటిస్తున్న సీరియల్స్ నుంచి తప్పుకోవడం గమనార్హం.