ప్రస్తుతం సెలబ్రెటీలు హాలిడే దొరికిందంటే చాలు మాల్గీవుల్లో వాలిపోతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ జంటలకు ఇదే ఫేవరెట్ హాలిడే స్పాట్. ఇక ఇప్పుడు టాలీవుడ్ నటీనటులకు సైతం మాల్దీవులే సెలవులకు అడ్డాగా మారాయి. అయితే సాధరణ సమయాల్లో భామలు బాయ్ ఫ్రెండ్ లతో వెళ్లి ఫోటోలను షేర్ చేస్తే నెటిజన్లు ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ప్రస్తుతం దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. రోజుకు లక్షల్లో కేసులు వేలలో మరణాలు నమోదవుతున్నాయి. న్యూస్ చూస్తేనే హార్ట్ ఎటాక్ వచ్చినంత పనౌతుంది. దేశంలో ఎక్కడ చూసినా ఆక్సీజన్ కొరత ఓషదాల కొరత క్లారిటీగా కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో కూడా బాలీవుడ్ బామలు మాల్దీవులకు వెళ్లి వచ్చారు. ఇటీవలే అలా రన్బీర్ కపూర్ అతడి ప్రేయసి అలియా భట్ మాల్దీవుల్లో ఎంజాయ్ చేసి వచ్చారు. అంతే కాకుండా సైఫ్ అలీఖాన్ కూతురు నటి సారా అలీఖాన్ కూడా కరోనా టైమ్ లోనే వెళ్లి అక్కడ ఎంజాయ్ చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇక వీరి ఫోటలకు లైకులు కొట్టడం పక్కన పెట్టి నెటిజన్లు ఒక రేంజ్ లో చివాట్లు పెట్టారు. ఈ విషయంపై క్రాక్ బ్యూటీ శృతి హాసన్ నెటిజన్లకే సపోర్ట్ చేస్తూ ఓ వీడియో పెట్టింది. అయితే ఇప్పుడు తారలు వెళదామన్నా ఛాన్స్ లేకుండా మాల్దీవులకు రావద్దంటూ బ్యాన్ చేసారు. కాగా తాజాగా ఈ విషయంపై శృతి హాసన్ స్పందించింది. మాల్దీవుల యాత్రను బ్యాన్ చేయడం మంచిదేనని సమర్ధించింది. కరోనా టైమ్ లో మాల్దీవుల్లో విహరిస్తూ సెల్ఫీలు షేర్ చేయడం మంచిదికాదని తెలిపింది. తన కోస్టార్స్ వెళ్లాలా వద్దా అన్నది తాను డిసైడ్ చేయడం లేదని ఒక వేళ వెళ్లినా ఫోటోలు షేర్ చేయడం మాత్రం సరికాదని శృతి హాసన్ వెళ్లడించింది. ఈ కష్టకాలంలో అలా చేయడం సరికాదని తాను కూడా సోషల్ మీడియాలో ఫోటోలు పెడుతున్నానని కానీ ఇంట్లో ఉండే సెల్ఫీలు పెడుతున్నానని చెప్పింది. ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని అది చాలా మంచి నిర్ణయమని పేర్కొంది.