కరోనా వైరస్ పై నాని భావుకత !

Seetha Sailaja
ప్రస్తుతం దేశంలో ఉన్న ప్రజలు కరోనా వైరస్ పేరు చెపితే ఉలిక్కి పడుతున్నారు. ఇప్పటికే దేశంలో రోజుకు నాలుగు లక్షల కేసుల సంఖ్య దాటిపోవడంతో ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే మే నెలాఖరుకు కరోనా కేసుల సంఖ్య రోజుకు 5 లక్షల స్థాయికి చేరిపోయినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. దీనితో ప్రజలు భయం గుప్పిటిలో జీవిస్తున్నారు.


ఇంకా ఈ సెకండ్ వేవ్ పూర్తి కాకుండానే కరోనా థర్డ్ వేవ్ తప్పదు అని హెచ్చరికలు వస్తున్న పరిస్థితులలో మనదేశ పరిస్థితి ఏమిటో ఆర్ధికవేత్తలకు కూడ అర్థం కావడం లేదు. ఇలాంటి పరిస్థితులలో ప్రస్తుతం షూటింగ్ లు ఆగిపోవడంతో తన ఇంటికే పరిమితం అయిపోయిన నాని కరోనా పరిస్థితుల పై భావయుక్తంగా స్పందించాడు.



నాని కరోనా పరిస్థితుల పై స్ఫూర్తిదాయకమైన పోస్టు పెట్టాడు. ఈమధ్య హైదరాబాద్ లో వర్షాలు కురుస్తున్న పరిస్థితులలో ఆకాశం మొత్తం మేఘాలు కమ్ముకొని ఉండగా మధ్యలో సూర్యుడి కిరణాలు ప్రసరిస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ‘‘మేఘాలు తొలగిపోతాయి. అందరూ క్షేమంగా ఉండండి. ఒకరికొకరు అండగా ఉండండి’’ అంటూ తన ఇన్ స్టా గ్రామ్ లో కామెంట్స్ పెట్టాడు.


ఈ పోష్ట్ నాని పెట్టిన కొద్ది సేపటికే వైరల్ గా మారింది. నాని కవితాత్మక హృదయాన్ని నెటిజన్ లు గుర్తించడమే కాకుండా నాని పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి ఆశావహ దృక్పథంతోనే ముందుకు సాగవలసిన అవసరం ఉందని చెపుతూ ఇలాంటి పాజిటివ్ ఆలోచనలలో ఉంటే ఎవర్ని కరోనా ఏమి చేయలేదు అంటూ అభిప్రాయ పడుతున్నారు. గతంలో ‘వి’ విడుదలకు కరోనా ఫస్ట్ వేవ్ అడ్డుగా నిలవడంతో ఆ మూవీని ఓటీటీ లో విడుదల చేసారు. ఇప్పుడు మళ్ళీ ‘టక్ జగదీష్’ మూవీకి కూడా కరోనా సెకండ్ వేవ్ అడ్డు తగిలింది. దీనితో ఈ మూవీ కూడ ఓటీటీ లో విడుదల అవుతుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి..




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: