చిత్రసీమలో ఈ బ్యూటీ రూటే సెపరేటు ...

VAMSI
రంగుల ప్రపంచం అనే సినీ జీవితంలోకి ఎంతో మంది తారలు వస్తుంటారు, పోతుంటారు. కానీ కొందరు మాత్రమే కృషితో, పట్టుదలతో తమ నటనా ప్రతిభతో ప్రేక్షకులను మెప్పించి వారి మనసుల్లో చెరగని ముద్ర వేసి సినీ చరిత్రలో నిలిచిపోతారు. అలాంటి వారిలో ఒకరు నటి అనుష్క శెట్టి. హీరోయిన్ అనగానే గుర్తొచ్చేది గ్లామర్. కానీ అనుష్క అనగానే గుర్తొచ్చే విషయాలు ఎన్నో ఎన్నెన్నో.. అందానికి అందం, అద్భుతమైన నటన, ఆకర్షించే హావభావాలు, 100% ఫిజిక్, తన పాత్రలతో సినిమాను అగ్ర స్థాయిలో నిలబెట్టగల ప్రతిభ స్వీటీ సొంతం. ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అనగానే మొదట వినిపించేది స్వీటీ పేరే. అంతగా పాత్రలకు జీవం పోసి రికార్డులు సృష్టించి విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటుంది అనుష్క.

అలాంటి ఈమెకు తొలుత సినిమాల్లోకి రావాలి అన్న ఆకాంక్ష లేదు. ఈమె ఆసక్తి అంతా ఫిట్నెస్ రంగం పైనే. కర్ణాటకకు చెందిన ఈమె బెంగుళూరులో విశ్వవిద్యాలయానికి అనుసంధానంగా ఉన్న మౌంట్ కార్మెల్ కళాశాల నుండి బి.సి.ఏ పట్టాను అందుకుంది.  భరత్ ఠాగూర్ అనే యోగా శిక్షకుడి దగ్గర శిక్షణ పొందింది. ఈమె అంకితభావం, పట్టుదలను గుర్తించిన ఠాగూర్ సూపర్ సినిమా ద్వారా సినిమా అవకాశాన్ని అందించారు. అలా సినీ రంగ ప్రవేశం చేసిన ఈమె నేడు టాప్ హీరోయిన్ గా రాణిస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నారు. అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు బీజం వేసి వాటికి క్రేజ్ తెచ్చిపెట్టింది జేజమ్మ.

కానీ ఇదంతా ఓవర్ నైట్ లో జరిగింది కాదు, ఒక్క సినిమాతో వచ్చింది కాదు. దీని వెనక ఆమె కృషి అనంతం. బిల్లా లో గ్లామరస్  రోల్, అరుంధతిలో మన సంస్కృతికి అద్దం పట్టే జేజమ్మ, సైజ్ జీరోలో  సాధారణ మహిళ, వేదం సినిమాలో వేశ్య ఇలా పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేసి ప్రాణం పెట్టి జీవించింది అనుష్క. ఆ డెడికేషనే స్వీటీని నేడు ఈ స్థాయిలో నిలబెట్టాయి. ఇలాంటి మన అనుష్క త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. మరి పెళ్లి తరువాత సినిమాల్లో కొనసాగుతుందా లేదా పూర్తిగా వైవాహిక జీవితంలోనే బిజీ గా మారనుందా తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: