అల్లు అర్జున్ సూపర్ హిట్ ఆర్య కి 17 ఏళ్లు .... !!
శివబాలాజీ ఒక ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని సొంతం చేసుకుని కెరీర్ పరంగా అల్లు అర్జున్ కి పెద్ద బ్రేక్ ను అందించింది. ఫీల్ మై లవ్ అనే కాన్సెప్టు తో మంచి యాక్షన్ తో కూడిన రొమాంటిక్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఆర్య గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటన, డ్యాన్స్ కి ప్రేక్షకాభిమానుల నుండి మంచి పేరు దక్కింది. ముఖ్యంగా ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ అందించిన సాంగ్స్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి అని చెప్పక తప్పదు.
అసలు విషయం ఏమిటంటే ఈ మూవీ విడుదలై నేటితో సక్సెస్ఫుల్ గా 17 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో పలువురు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ మూవీ పేరుతో సోషల్ మీడియా మాధ్యమాల్లో ట్రెండ్ సృష్టించి వైరల్ చేస్తున్నారు. అలానే తమ హీరో అల్లు అర్జున్ కి ఆర్య మూవీ టీం కి ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియజేస్తున్నారు. మరోవైపు హీరో అల్లు అర్జున్ కూడా ఈ సినిమా తనకు ఎంతో ప్రత్యేకం అంటూ తన సోషల్ మీడియా అకౌంట్స్ లో ఒక పోస్ట్ చేయడం జరిగింది..... !!