గిన్నీస్ బుక్ రికార్డ్స్ కొట్టిన నటులు సెలెబ్రెటీలు వీళ్ళే..!

N.ANJI
చిత్ర పరిశ్రమ అంటేనే రంగుల ప్రపంచం. ఈ మాయ లోకంలో రాణించాలంటే అందం, అభినయంతో పాటు అదృష్టం ఉండాలి. కొందరికి ఒక్క సినిమాతో గుర్తింపు వస్తే మరికొందరికి రెండు, మూడు సినిమాలకు గుర్తింపు వస్తుంది. అదృష్టం లేకపోతే ఎంత కష్టపడిన సరైన గుర్తింపు దొరకదు. ఇక అరుదైన రికార్డులు, అవార్డులు రావాలంటే చాలా శ్రమించాల్సి ఉంటుంది.
సాధారణంగా సినిమాకు అవార్డు వస్తేనే చాలా సంతోషిస్తాం. ఇక ఆ ఆనందానికి అవధులు ఉండవు. అలాంటిది ఏకంగా గిన్నీస్ బుక్ రికార్డ్స్ లో చోటు దక్కాలంటే ఎంత కృషి, పట్టుదల దాగి ఉంటాయి. అయితే మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఆరుగురు సెలబ్రిటీలు గిన్నీస్ బుక్ లో చోటు దక్కించుకున్నారు. అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా విజయనిర్మల 2000లోనే గిన్నీస్ రికార్డు సాధించారు. చిన్న వయస్సులోనే ఇండస్ట్రీకి వచ్చిన ఈమె హీరోయిన్ గా చేయడంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో 42సినిమాలను డైరెక్ట్ చేసి, రికార్డు క్రియేట్ చేసారు.
ఇక స్క్రీన్ మీద కనిపిస్తే చాలు, పగలబడి నవ్వేసేలా తన నటనతో అదరగొట్టిన బ్రహ్మానందం లెజెండ్ గా ఎదిగారు. వెయ్యికి పైగా సినిమాల్లో నటించినందుకు 2010లో గిన్నీస్ బుక్ లో చోటు దక్కించుకున్నారు. మూవీ మొఘల్ డాక్టర్ డి.రామానాయుడు ఎక్కువ సినిమాలు నిర్మించడమే కాకుండా, అన్ని భాషాల్లో చిత్రాలు నిర్మించిన ఘనత సాధించి, 2008లో గిన్నీస్ బుక్ లో స్థానం దక్కించుకున్నారు. 13 భాషల్లో 150కి పైగా సినిమాలు నిర్మించారు.  
అంతేకాదు గత ఏడాది దివగంతులైన గానగంధర్వులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం 40వేల సాంగ్స్ పాడి రికార్డ్ క్రియేట్ చేశారు. 2001లో బాలు గిన్నీస్ బుక్ లో స్థానం దక్కించుకున్నారు. గానకోకిల సుశీల 18వేల సాంగ్స్ ఆలపించి గిన్నిస్ బుక్ లోకి ఎక్కారు. గజల్స్ బాగా ఆలపించే గజల్ శ్రీనివాస్ 100భాషల్లో గజల్స్ పాడిన ఘనత సాధించి 2008లో గిన్నీస్ బుక్ లో స్థానం దక్కించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: