అమ్మ పాత్రల్లో మాతృత్వం పండించిన నటీమణులు వీళ్ళే..!

Suma Kallamadi
అమ్మతనం అంతులేని మాధుర్యం. మాటల్లో వర్ణించలేనిది. ఎన్ని యుగాలు గడిచినా అమ్మ రుణం తీర్చుకోలేనిది. అమ్మ అన్న రెండు అక్ష‌రాల ప‌దంలో ఎంత‌టి మాధుర్యం దొరుకుతుందో మాట్లో చెప్ప‌లేనిది. పేగు తెంచుకొని పుట్టిన బిడ్డలకు ప్రేమ పంచటంలో అమ్మకు మరెవరూ సాటిరారనేది నిత్య సత్యం. మరుజన్మకు సాహసించి మనకు ఊపిరిపోసే తల్లిని ఎంత పూజించినా ఆమె రుణం తీర్చుకోలేనిది. అమ్మ త్యాగాన్ని ఎంతగా చెప్పినా తక్కువే. అంతటి ఘనత అమ్మకు మాత్రమే ఉంది. అమ్మ ప్రేమను నిజజీవితలోనే కాదు.. వెండితెరపై కూడా అంతమించి చూపించారు. వాళ్ళను నటనను చుస్తే నిజజీవితంలోనూ ఇలానే ఉంటారా అనే సందేహం వస్తుంది. అలాంటి నటీమణుల గురించి తెలుసుకుందామా.

సీనియర్ నటి అన్నపూర్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమె హీరోయిన్ గా తన కెరీర్ ను ప్రారంభించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడ్డారు. దాదాపు సినీ పరిశ్రమలోని హీరో, హీరోయిన్లందరికీ తల్లిగా, బామ్మగా, అత్తగా నటించి.. ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా అక‌ట్టుకున్నారు. అంతే కాదు, ఆమె అలనాటి మేటి నటుల సరసన హీరోయిన్ గా చేసి తిరిగి వారికి తల్లిగా నటించడం మ‌రో విశేషం అని చెప్పుకోవాలి.

ఇక సహజ నటి జయసుధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె స్టార్ హీరోయిన్ గా రాణించారు. ఆ తర్వాత క్యరెక్టర్ ఆర్టిస్టుగా అమ్మ, వదిన, అక్క క్యారెక్టర్ లో నటించి ఎంతగానో ఆకట్టుకుంది. ఈ క్ర‌మంలోనే కొత్తబంగారు లోకం, బొమ్మరిల్లు, అమ్మానాన్న ఓ తమిళమ్మాయి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఇలా ఎన్నో సినిమాల్లో హీరోకు త‌ల్లిగా ఒదిగిపోయారు.

అందాలతార సుహాసిని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆమె తండ్రి చారు హాసన్‌ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న సుహాసిని సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోగలిగారు.  స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా నటించిన సుహాసిని ఆ తర్వాత కెరెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా సత్తా చాటారు. ముఖ్యంగా పెదబాబు, గబ్బర్ సింగ్, లీడర్, వరుడు వంటి సినిమాల్లో తల్లి పాత్రలతో తనదైన ముద్రవేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: