ఆకర్షించే అందం ఉన్నా.. షకీలా పెళ్లి చేసుకోలేదు.. ఎందుకో తెలుసా?
అయితే ప్రస్తుతం ఏకంగా 40 ఏళ్ల వయస్సు వచ్చినప్పటికి కూడా షకీలా ఎందుకు పెళ్లి చేసుకోకుండా ఉన్నారు అన్నది అటు ఎంతోమంది సినీ ప్రేక్షకులకు తెలియని ఒక ప్రశ్నగా మారింది. అయితే షకీలా పెళ్లి చేసుకోక పోవడం వెనుక పెద్ద కారణమే ఉంది అన్నది ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ద్వారా బయట పెట్టింది ఈ నటి. షకీలా ని పెళ్లి చేసుకోవడానికి ఎంతో మంది ముందుకు వచ్చినప్పటికీ ఎప్పుడు అందరికీ నో చెబుతూ వచ్చిందట షకీలా. కానీ తాను ఒకానొక సమయంలో ఒక వ్యక్తి ప్రేమలో పడితే ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధమైన సమయంలో చిత్ర పరిశ్రమకు దూరం కావాలని సదరు వ్యక్తి చెప్పడంతో ఇక చిర్రత్తిపోయినా షకీలా ఏకంగా అతనిని చితకబాదిందట. ఇక అప్పుడే జీవితంలో పెళ్లి చేసుకోవద్దు అని డిసైడ్ అయినట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం అయితే తనకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదని కానీ తనకు ఇప్పటికీ కూడా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అంటూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది షకీలా. అంతేకాదు తనను చిన్నప్పటి నుండి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఇక్కడ వరకు వచ్చానని ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న అంటూ షకీలా చెప్పుకొచ్చింది. 47 ఏళ్ళ వయసు వచ్చినప్పటి అదే అందంతో ప్రేక్షకులను అలరిస్తుంది.ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో అవకాశాలు తగ్గిపోయినప్పటికీ అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా మాత్రం మెరుస్తూ అభిమానులను అలరిస్తు ఉంటుంది షకీలా.