దేశంలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకు లక్షల సంఖ్యలో కేసులు వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. సాధారన ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు , సెలబ్రెటీలు సైతం కరోనా కాటుకు బలవుతున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు కరోనా బారిన పడి మరణించగా తాజాగా నిన్న సోమవారం ప్రముక జర్నటిస్ట్ , నటుడు టీఎన్ఆర్ తుమ్మల నర్సింహారెడ్డి కరోనాతో మరణించారు. కొద్దిరోజుల క్రితం టీఎన్ఆర్ సోదరి కరోనా బారిన పడగా ఆమె వెంటిలేటర్ పై చికిత్స తీసుకుని కోలుకున్నారు. ఆ వెంటనే టీఎన్ఆర్ సైతం కరోనా బారిన పడ్డారు. చికిత్స తరవాత టీఎన్ఆర్ కు నెగిటివ్ వచ్చినప్పటికీ అనారోగ్య సమస్యలతో మళ్లీ ఆస్పత్రిలో చేరారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన సోమవారం మరణించారు. టీఎన్ఆర్ మరణంతో టాలీవుడ్ లో విషాదం నిండుకుంది. టాలీవుడ్ లోని సెలబ్రెటీలంతా టీఎన్ఆర్ మృతిపట్ల సంతాపం ప్రకటించారు. అంతే కాకుండా ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి టీఎన్ఆర్ కుటుంబానికి ఫోన్ చేసి మాట్లాడారు.
టీఎన్ఆర్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టీఎన్ఆర్ స్వయం కృషితో ఎదిగారని ఆయన ఎంతో మందికి ఆదర్శమని అన్నారు. అంతే కాకుండా మెగాస్టార్ టీఎన్ఆర్ కుటుంబానికి తక్షణ సాయం కింద రూ. 1లక్ష ఆర్థిక సాయం అందజేశారు. అంతే కాకుండా భవిష్యత్ ఎలాంటి అవసరం ఉన్నా టీఎన్ఆర్ కుటుంబానికి అండగా ఉంటానని చెప్పారు. ఇదిలా ఉండగా తాజాగా బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కూడా టీఎన్ఆర్ కుటుంబానికి ఆర్థికసాయం అందించారు. ఈ మేరకు సంపూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. సినిమా జర్నలిస్ట్ టీఎన్ఆర్ కుంటుబానికి 50000 వేలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ డబ్బును టీఎన్ఆర్ గారి భార్య అకౌంట్ కు ట్రాన్పర్ చేశాను. వారి ఇంటర్యూ ద్వారా నేను వ్యక్తిగతంగా కెరీర్ పరంగా ఎదిగాను. వారి కుటుంబానికి ఎప్పుడు ఎలాంటి సహాయం కావాలన్నా నేను అండగా ఉంటాను. మీరు కూడా వారి కుంటుంబానికి సపోర్ట్ గా ఉండండి. ఈ కష్ట కాలంలో మనిషికి మనిషికి తోడుండాలి అంటూ సంపూర్నేష్ బాబు పేర్కొన్నారు.