బాహుబలి నిర్మాత ఇలా చేస్తున్నాడేంటి..?

P.Nishanth Kumar
ప్రభాస్ కి ప్రస్తుతం నేషనల్ వైడ్ మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే.. బాహుబలి సినిమా తో ఆయన నేషనల్ వైజ్ క్రేజ్ సంపాదించుకోగా మార్కెట్ కూడా అదే విధంగా పెరిగింది.. ఇప్పుడు ఆయన చేసే ప్రతి సినిమా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కుతోంది.. ఒకేసారి నాలుగు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక ప్రభాస్ అని చెప్పాలి.. దేశంలో ఏ హీరోకి సాధ్యం కాని రికార్డును ప్రభాస్ నెలకొల్పుతున్నాడు..
ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ పై దర్శకధీరుడు రాజమౌళి 'బాహుబలి' 'బాహుబలి 2' చిత్రాలను తెరకెక్కించారు. నిర్మాతలు శోభు యార్లగడ్డ - ప్రసాద్ దేవినేని పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఇండియాలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా 'బాహుబలి 2' బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. దీంతో ప్రొడ్యూసర్స్ గా బాగా లాభాలు గడించారని అందరూ భావించారు. అదే సమయంలో వీరి బ్యానర్ లో నెక్స్ట్ ఎలాంటి సినిమా రాబోతుందో అని ఆలోచించారు.
'బాహుబలి' నిర్మాతలు మాత్రం అందుకు భిన్నంగా మూడేళ్ళ గ్యాప్ తీసుకుని 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' అనే చిన్న రీమేక్ సినిమాతో వచ్చారు. ఇదే క్రమంలో ఇప్పుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కుతున్న ''పెళ్లి సందD'' చిత్రాన్ని ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అయితే వందల కోట్ల బడ్జెట్ తో వేల కోట్లు వసూలు చేసిన సినిమా తీసిన ప్రొడ్యూసర్స్.. ఇలా తక్కువ బడ్జెట్ సినిమాలు చేయడం ఏంటని అందరూ ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు 'బాహుబలి' కారణంగా నిర్మాతలకి లాభాలు వచ్చాయా లేదా? అని సినీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.అయితే 'బాహుబలి' చిత్రానికి వచ్చిన కలెక్షన్స్ కి నిర్మాతల జేబుల్లోకి వెళ్లిన లాభాలకి అసలు పొంతన లేదనే వాదన వినిపిస్తోంది. 'బాహుబలి' ఓవర్ ఫ్లోస్ ఇంకా రావాల్సి ఉండటంతో.. మళ్లీ అలాంటి రిస్క్ చేయకుండా నిర్మాతలు లో ప్రొఫైల్ సినిమాలు చేస్తున్నారని ట్రేడ్ వర్గాల్లో టాక్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: