కూతురి ముద్దు సీన్లు చూడలేడు: హీరోయిన్ తల్లి
అయితే ఈ సీన్ లలో, ఇలాంటి సినిమాల్లో నటించేటప్పుడు వారు పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు.. ఓవైపు ఫ్యామిలీ ఈ సినిమా చూస్తుందనే భయం.. మరోవైపు సినిమా చేయకపోతే మరో అవకాశం వస్తుందో లేదో అన్న భయం..వీటన్నిటి మధ్య నలిగిపోతూ తమ అందాల ప్రదర్శన చేయడానికి ఒప్పుకుంటారు హీరోయిన్ లు.. ఆ తర్వాత వారి అందాలతో మంచి పోపులరిటిని, ఫ్యాన్స్ ని సంపాదించుకుంటారు.
అయితే ఇలాంటి సీన్లలో నటించినపుడు తమ పేరెంట్స్ ఏమనుకుంటారో కొంతమంది హీరోయిన్లు వెల్లడించారు.. అలాb మహిమ కపూర్ దీనిపై వివరణ ఇచ్చింది.. షనయ బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహార్ బాలీవుడ్ కి పరిచయం చేస్తుండగా, ఈ మూవీ కోసం, ఆమె అందాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఈ క్రమంలో మహిమ కపూర్ ఓ ఇంగ్లీష్ పేపర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో కూతురు కి సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు.. షనాయ నటించిన కొన్ని సీన్స్ ని చూస్తే సంజయ్ కపూర్ ఎలా రియాక్ట్ అవుతారని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పింది.. అలాంటి సీను మొదట సంజయ్ చూసి ఆశ్చర్యపోయినా, కూతురి వర్క్ విషయంలో మాత్రం జోక్యం చేసుకోడని తెలిపింది..