మోనాల్ గజ్జర్..తన అందంతో కుర్రకారును ఊగిసలాడించిన హీరోయిన్. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటోంది. సుడిగాడు సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అయితే ఆ సినిమా అంతగా కలిసిరాలేదు. దీంతో సుడి తిరగని హీరోయిన్ గా మోనాల్ గజ్జర్ మరో అవకాశం కోసం ఎదురుచూసింది. అయితే ఆ తర్వాత బిగ్‌బాస్ సీజన్ 4తో ఈ బ్యూటీ సుడి తిరిగిపోయింది. టాలీవుడ్‌లో హాట్ హీరోయిన్‌గా, సెలబ్రిటీగా, టెలివిజన్ హోస్ట్‌గా మారిపోయింది. బిగ్‌బాస్ తర్వాత అల్లుడు అదుర్స్ చిత్రంలో స్పెషల్ సాంగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకొన్న ఈ భామ పలు సినిమాల్లో నటించేందుకు సిద్దమవుతున్నారు. కథా చర్చల్లో ఉంటూ చాలా సెలక్టివ్‌గా సినిమాలను ఎంపిక చేసుకొంటున్నారు.
ప్రస్తుతం తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి అనే సినిమాలో బిగ్‌బాస్ ఫేం అఖిల్ సార్థక్‌తో కలిసి నటిస్తున్నారు. అయితే మోనాల్ గజ్జర్ ఖాళీ సమయాల్లో అడ్వెంచర్స్ ఈవెంట్స్‌లో పాల్గొంటూ తన సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నది. తనకు హార్స్ రైడింగ్ అంటే ఎంతో ఇష్టం. అలాగే గంగ్ హో, ఐస్ స్కేటింగ్ లాంటి క్రీడలంటే తనకు మరింత ఇష్టమని పేర్కొన్నారు. తనకు ఇష్టమైన వ్యవహారాల గురించి వెల్లడిస్తూ పారా గ్లైడింగ్, ఇతర క్రీడలను నా సోదరితో ఎంజాయ్ చేస్తుంటానని తెలిపారు. బిగ్ బాస్ సీజన్ 4లో తన అందచందాలతో మోనాల్ గజ్జర్ అదరగొట్టింది. ఈ భామ ఆ సమయంలో ఓ వైపు టాస్క్‌ల్లో అదరగొడుతూనే మరోవైపు మరో ఇంటి సభ్యుడు అఖిల్‌తో క్లోజ్‌గా మూవ్ అవుతూ రొమాన్స్ చేయడంతో సూపర్ పాపులర్ అయ్యింది. ఆ టైంలో వారిద్దరూ ప్రేమలో ఉన్నట్లు అందరూ అనుకున్నారు. అయితే ఆ తర్వాత షో అయ్యాక ఎవరిదరి వారిది అంటూ వెళ్లిపోయారు. ప్రస్తుతం మోనాల్ గజ్జర్ మాటీవీలో వస్తున్న డాన్స్ ప్లస్ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ఇందులో కూడా తన అందంతో తనదైన మార్క్ ను సొంతం చేసుకుంటోంది.