కౌశల్ మండా గురించి మీకు తెలియని మరికొన్ని విషయాలు..
కౌశల్ మండా.. 1981 మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని విశాఖపట్నంలో జన్మించాడు. అతని తండ్రి ప్రభుత్వ ఉద్యోగి అలాగే నాటకరంగ కళాకారుడు కూడా.. కౌశల్ ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి 2003లో బీటెక్ పూర్తి చేశాడు. కళాశాల స్థాయిలో బాడ్మింటన్ క్రీడాకారుడు. అంతేకాకుండా కౌశల్ గుర్రపు స్వారీ కూడా చేసేవాడు. అతను స్కూల్లో చదువుతున్న సమయంలో తండ్రిలాగా నటుడు కావాలని ఎన్నో కలలు కన్నాడు. ఇక అందుకు తగ్గట్టుగానే మొదట మోడలింగ్ లో అవకాశాలు అందుకున్న తర్వాత నటుడిగా మారాడు.. కౌశల్ మోడల్ గా మారుతి కార్గో, విజయ టెక్ట్స్ టైల్ వంటి సంస్థల వాణిజ్య ప్రకటనలకు పనిచేశాడు..
ఆ తర్వాత మహేష్ బాబు నటించిన రాజకుమారుడు చిత్రం ద్వారా వెండితెర ప్రవేశం చేశాడు. ఇక బుల్లితెరపై పలు ధారావాహికలలో కూడా కౌశల్ నటించాడు.. 200కి పైగా వాణిజ్య ప్రకటనల్లో నటించిన కౌశల్ మోడలింగ్ పై మంచి పట్టు ఉండడంతో సొంతంగా హైదరాబాద్ లో యాడ్ ఏజెన్సీ ప్రొడక్షన్ హౌస్ ను నిర్వహిస్తున్నాడు. ఇక 1999లో లుక్స్ పేరుతో మోడలింగ్ ఏజెన్సీ ని కూడా ప్రారంభించాడు. ఇక 1999లోనే మిస్టర్ ఇండియా పోటీల్లో ఫైనల్ వరకు వెళ్ళాడు కౌశల్ . అంతేకాకుండా పలు సినిమాలలో సహాయకుని పాత్రలో కూడా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందాడు.
ఆ తర్వాత కౌశల్ బిగ్బాస్ సీజన్ 2 లో పాల్గొని విజేతగా నిలిచాడు. అలా వచ్చిన బహుమతిని క్యాన్సర్ బాధితుల కోసం వినియోగిస్తానని గ్రాండ్ ఫినాలే వేదికగా కూడా ప్రకటించాడు..నిజానికి బిగ్ బాస్ రియాల్టీ షోలో తెలుగు స్టార్ అవ్వగానే ఒక రేంజిలో హైప్ క్రియేట్ అవుతుంది. అలా బిగ్ బాస్ లో పాల్గొన్న ఎంతో మంది నటులు స్టార్స్ గా కూడా ఎదిగారు. ప్రస్తుతం మూడు సీజన్ లకు అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. అయితే బిగ్బాస్ సీజన్ వల్ల ప్రతి ఒక్కరూ పాపులర్ అవుతూనే ఉన్నారు. కానీ కౌశల్ మండా మాత్రం అనుకున్నంత సక్సెస్ కాలేదు. చివరగా చిన్న తరహా పాత్రలను అందుకుంటున్నాడు.