సోనూ సుద్ సమంతల స్పూర్తిని చేరుకోలేని టాప్ హీరోలు !

Seetha Sailaja

కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో సోనూ సుద్ చేసిన సేవా కార్యక్రమాల కోసం తన ఇంటిని తాకట్టు పెట్టాడు అన్న విషయం తెలుసుకుని చాలామంది ఆశ్చర్య పడ్డారు. సోనూ సుద్ సేవా స్పూర్తికి అంతర్జాతీయ పత్రిక టైమ్ మ్యాగజైన్ కూడ ఇతడి సేవా కార్యక్రమాల పై ఆసక్తికర కథనం ప్రచురించడంతో అతడి ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిపోయింది.


ప్రస్తుతం దేశంలో చాలామంది కరోనా పేషంట్లు ఆక్సిజన్ లేక అల్లాడిపోతున్న పరిస్థితులలో సోనూ తన సొంత డబ్బుతో ముంబాయిలో ఆక్సిజన్ ప్లాంట్ పెట్టడానికి అనుమతులు కావాలని లేఖ వ్రాసి మీడియాకు హాట్ టాపిక్ గా మారాడు. సోనూ సుద్ స్పూర్తితో ఇప్పటివరకు మన తెలుగు టాప్ హీరోలు ఎవరు స్పందించకపోయినా సమంత ఈ సేవలో తాను కూడ భాగం పంచు కుంటాను అంటూ ముందడుగు వేసింది.


భాగ్యనగరం చుట్టుపక్క ప్రాంతాలలో ఆదాయం తక్కువగా ఉండేవారు నివసించే కొన్ని ప్రాంతాలను ఎంచుకుని వారందరికీ కరోనా వస్తే వేసుకోవలసిన మందుల కిట్టును అదేవిధంగా ఆక్సీ మీటర్ ను అందచేయడం ఇప్పుడు హాట్ న్యూస్ గా మారింది. ఈ కార్యక్రమాన్ని సమంత తన ప్రత్యూష ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తూ ఆమె సామాజిక స్పూర్తిని మరొకసారి చాటుకుంది.


ఇప్పుడు ఈవార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె అభిమానులు ఆమెను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతూ అక్కినేని కోడలును ఆకాశానికి ఎత్తేస్తున్నారు. 40-50 కోట్లు పారితోషికం తీసుకునే టాప్ హీరోలు ఈసారి కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఏకార్యక్రమాలు చేయకుండా మౌనంగా ఉంటే సమంత మాత్రం అందరి హీరోల తీరుకు భిన్నంగా ఇలాంటి సేవా కార్యక్రమాలను ప్రస్తుత కరోనా సెకండ్ వేవ్ సమయంలో చేయడం ఆమె మంచి మనసుకు నిదర్శనం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనితో సేవా కార్యక్రమాలను ఎప్పుడూ ముందు ఉండి నడిపించే చిరంజీవి ఏమి చేయబోతున్నాడు అన్న ఆశక్తి అందరిలోను పెరిగిపోతోంది..





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: