రామ్ పోతినేని గురించిన ఆసక్తికర విషయాలు ఇవే. !
రామ్ మొదటగా వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన దేవదాసు సినిమాలో నటించాడు. ఆ సినిమా మంచి విజయాన్ని ఇచ్చింది.ఈ సినిమాలో హీరోయిన్ గా ఇలియానా నటించింది.ఈ చిత్రం 2006 జనవరి 11న విడుదల కాగా బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకొని, అటు ఇలియానాకు ఇటు రామ్‌కు ఓ మంచి సక్సెస్ ను ఇచ్చింది.ఈ సినిమా రామ్ కి ఫిలింఫేర్ ఉత్తమ నూతన నటుడు అవార్డును కూడా అందించింది. అలా రామ్ తన సినీ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు. ఈ మధ్య రీసెంట్ గా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ద్వారా తనలో దాగి ఉన్న మరొక మాస్ యాంగిల్ ను ప్రేక్షకులకు చూపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.
ఈ సినిమాలో రామ్ యాక్షన్ గాని, డైలాగ్స్ గాని బాగా పేరు తెచ్చాయి. రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా ఇస్మార్ట్ శంకర్ నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత రెడ్ అంటూ వచ్చాడు.కానీ ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.ఇక రామ్ పోతినేని నటిస్తున్న ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే తమిళ డైరెక్టర్ లింగుసామితో ఓ సినిమాను ప్రకటించారు రామ్. ఈ సినిమాలో హీరోయిన్‌గా కృతి శెట్టి నటించనుంది. ఈ సినిమా ఒకేసారి తెలుగు, తమిళ భాషాల్లో ఏక కాలంలో బై లాంగువల్ చిత్రంగా దీనిని రూపోందనుంది. ఈ సినిమాను ఎస్ ఎస్ స్క్రీన్స్ బ్యానర్ లో శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్నారు.ఇక తాజాగా రామ్ మరో సినిమాను కూడా ఓకే చేసినట్లు తెలుస్తోంది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ ఓ సినిమాలో నటించనున్నట్టు టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. ఈరోజు రామ్ పుట్టినరోజు కాబట్టి అభిమానులు, సినీమా ప్రముఖులు రామ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. !