మన టైసన్ ని ఇప్పుడు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే...

Purushottham Vinay
టాలీవుడ్ క్లాసిక్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినిమాలు ఎలా వుంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలా నాచురల్ గా సాధారణ ప్రేక్షకులకు పూర్తిగా కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించడం శేఖర్ కమ్ముల స్పెషాలిటీ.అలా ఇండస్ట్రీకి ఎన్నో అద్భుతమైన హిట్స్ ని ఇచ్చాడు కమ్ముల. ఇక శేఖర్ కమ్ముల తెరకెక్కించిన సినిమాలలో కాలేజీ స్టూడెంట్స్ కి యూత్ కి ఎంతగానో గుర్తుండిపోయే సినిమా "హ్యాపీ డేస్".ఇక ఈ సినిమాలో అందరిని ఎంతగానో ఆకట్టుకున్న పాత్ర టైసన్ పాత్ర.

రాహుల్ దయా కిరణ్ ఈ పాత్రలో నటించాడు. ఇక ఈ సినిమాలో ఇతడి యాక్టింగ్ కి ఎమోషనల్ సీన్స్ కి యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. హ్యాపీ డేస్ సినిమా విడుదలైనపుడు మనోడి వయసు 21. అప్పుడు అందులో చాలా బక్కగా ఉన్నాడు.అప్పుడే డిగ్రీ పట్టా చేత పట్టుకుని వచ్చి శేఖర్ కమ్ముల సినిమాలో నటించాడు. ఆ సినిమా ట్రెండ్ సెట్టర్ అయినా కూడా అందులో నటించిన వాళ్లలో నిఖిల్ తప్ప ఎవరూ నిలబడలేకపోయారు. తమన్నా అప్పటికే గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్. మిగిలిన వాళ్లలో వరుణ్ సందేశ్ కాస్త పర్లేదనిపించాడు.

ఇక రాహుల్, వంశీ అయితే ఎక్కడున్నారో కూడా తెలియదు. అడపాదడపా సినిమాలు చేసినా కూడా ప్రేక్షకులకు మాత్రం హ్యాపీ డేస్ టైసన్‌గానే గుర్తున్నాడు రాహుల్. తన అస్థిత్వం కోసం అప్పుడప్పుడూ రెయిన్ బో, వెంకటాపురం లాంటి సినిమాలు చేసినా కూడా గుర్తింపు రాలేదు.దాంతో ఇంట్లోనే ఉండి బాడీ బిల్డప్ చేసాడు. ఇప్పుడు ఎవరూ గుర్తు కూడా పట్టనంతగా మారిపోయాడు ఈయన. తాజాగా విడుదలైన రాహుల్ ఫోటోలను చూసి షాక్ అవుతున్నారు ఆడియన్స్.హ్యాపీ డేస్ సినిమాలో టైసన్ బక్క బాబు ఇప్పుడు కండల బాబు అయ్యాడు. అమ్మో రాహులా.. ఆ కుర్రాడే ఇప్పుడు ఇలా అయ్యాడా అంటూ షాక్ అవుతున్నారు.కోర మీసాలతో చాలా హ్యాండ్సం గా తయారయ్యి ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు.అచ్చం ఆర్.ఆర్.ఆర్ సినిమాలో రామ్ చరణ్ మాదిరి లేడు... ప్రస్తుతం ఈ పిక్ నెట్టింటా తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: