నాగచైతన్యపై మండిపడుతున్న సమంత.. ఎందుకంటే..!

N.ANJI
చిత్ర పరిశ్రమలో సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. సమంత నాగచైతన్యను పెళ్లి చేసుకొని అక్కినేని వారి కోడలైంది. ఇక పెళ్లి తరువాత కూడా సమంత సినిమాలో రాణిస్తున్నారు. ఇక పెళ్లి తర్వాత కూడా వీరిద్దరు కలిసి మజిలీ సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ఇక వీరిద్దరూ జంటగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నప్పుడు వీరిద్దరి మధ్య జరిగే సంభాషణ ఎంతో ఆసక్తిగా ఉంటుంది.అంతేకాకుండా సమంత ఇంట్లో ఉండే విధానంపై నాగ చైతన్య చాలాసార్లు ఫన్ కూడా చేశాడు. ఆహా యాప్ లో సమంత సామ్ జామ్ అనే రియాల్టీ షోకు హోస్ట్ గా చెయ్యగా ఆ సమయంలో నాగచైతన్యను కూడా ఇంటర్వ్యూ చేసింది. ఆ ఎపిసోడ్ లో సమంత అడిగిన ప్రశ్నలకు నాగ చైతన్య చెప్పిన సమాధానాలు అందరిని షాక్ కి గురి చేసాయ్.



ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం నాగ చైతన్య వరుస సినిమాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమాలో నటించగా.. ప్రస్తుతం మరో సినిమాలో బిజీగా ఉన్నాడు నాగ చైతన్య. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న థాంక్యూ సినిమాలో నటిస్తున్నాడు. అందులో చైతు సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ విషయాన్ని రాశి ఖన్నా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది. చైతన్యతో కలసి తీసుకున్న ఫోటో కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది.
కాగా, ప్రస్తుతం ఆ ఫోటో వైరల్ గా మారింది. ఈ ఫోటోపై మీమర్స్ భారీ జోకులు వేస్తున్నారు. అందులో చైతు, రాశి చనువుగా తీసుకున్న ఫోటోను సమంత చూస్తున్నట్టు ఎడిట్ చేసి.. 'పక్కకి జరుగు రాశి' అని సమంత అంటున్నట్టు ఫోటో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సమంత అది కేవలం సినిమా.. నాగ చైతన్యపై అంత సీరియస్ అవ్వకు అమ్మ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: