హ్యాపీ బర్త్డే ఛార్మి: హీరోయిన్ నుండి నిర్మాతగా మారిన చార్మీ ?

VAMSI
తెలుగు ఇండస్ట్రీ లో ధృవతారగా మెరిసిన హీరోయిన్ చార్మి ఆ తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి హీరోయిన్ గా మాయమయ్యారు. 14 ఏళ్ల వయసులో ఈమె సినీరంగ ప్రవేశం చేసింది. అనుకోకుండా ముంబైలో ఈమెను చూసిన ఒక ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి ఈమెకు అవకాశం ఇచ్చారు. అలా 2001 లో రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టింది ఛార్మి. ఆ సమయంలో ఛార్మి వయసు కేవలం 14 సంవత్సరాలు మాత్రమే కావడంతో ఆమెతో పాటుగా ఆమె ఫ్యామిలీ కూడా హైద్రాబాద్ కి షిఫ్ట్ అయ్యింది. ఛార్మి తండ్రి ముంబైలో ఒక ప్రముఖ వాస్తు శాస్త్ర కన్సల్టెంట్ అయినా కూడా తన కూతురు భవిష్యత్తు కోసం అక్కడ అన్ని వదిలేసి కూతురు వెంట నడిచారు. తాను ఖచ్చితంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో క్లిక్ అవుతుందని దృఢంగా నమ్మారు. ఆ విధంగా 2001 లో నీతోడు కావాలి సినిమాతో హీరోయిన్ గా సినీ కెరియర్ ని ప్రారంభించింది ఛార్మి కౌర్.
ఆ తర్వాత "కాదల్ కిసు కీసు" అనే చిత్రంతో తమిళ ప్రేక్షకులకు పరిచయమైన ఛార్మి ఆ సినిమాతో తన  హిట్ ఖాతాను ఆరంభించింది. డైరెక్టర్ కృష్ణ వంశీ శ్రీ ఆంజనేయం సినిమాలో ఛాన్స్ ఇవ్వడంతో మళ్లీ టాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యారు ఛార్మి.  ఇక అమే కెరియర్ లో చెప్పుకోదగ్గ మొదటి హిట్ అంటే మంత్ర సినిమా అనే చెప్పాలి. 2007 లో విడుదలైన ఈ సినిమా అంచనాలకు మించి ఆదరణను పొందింది. జ్యోతిలక్ష్మి, సకుటుంబ సపరివార సమేతం,  మైకేల్ మదన కామరాజు, రాఖీ, చిన్నోడు, పౌర్ణమి, స్టైల్, లక్ష్మీ, చుక్కల్లో చంద్రుడు, అల్లరి పిడుగు, చక్రం, అనుకోకుండా ఒకరోజు, మాస్, చంటి వంటి పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఛార్మి మొదట్లో సంపాదించే కొంత డబ్బులతో తన కుటుంబం అడ్జస్ట్ చేసుకుని జీవించేదని, తన ఫ్యామిలీ అంతగా తనకు సపోర్ట్ చేశారని ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది ఛార్మి.
తన తండ్రి తన కోసం ఆయన వృత్తిని వదిలి నా వెంటరావడం వల్లే సినీ పరిశ్రమలో నిలబడగలిగాను లేదంటే ఆ రోజు ఆయన ఛార్మి ఏం చేయగలదులే అనుకుని ఉంటే నాకు ఈరోజు ఇంత పెద్ద గుర్తింపు ఉండేది కాదు అంటూ చెప్పారు.  తెలుగులో మంత్ర 2 తర్వాత ఈమె హీరోయిన్ గా చేయడం ఆపేసి నిర్మాతగా మారారు. దర్శకుడు పూరి ప్రొడక్షన్ లోకి అడుగు పెట్టారు.   జ్యోతి లక్ష్మీ చిత్రానికి ఈమె హీరోయిన్ గా చేస్తూనే నిర్మాణ భాద్యతలు చేపట్టారు .ఆ తర్వాత పూరి దర్శకత్వంలో పైసా వసూల్, మెహబూబా, ఇస్మార్ట్ శంకర్, రొమాంటిక్, లైగర్ వంటి పలు సినిమాలకు నిర్మాతగా మారారు ఛార్మి ప్రస్తుతం ఇలా నిర్మాతగా  కొనసాగుతున్నారు. ఇష్మార్ట్ శంకర్ మూవీ మంచి కలెక్షన్లు రాబట్టి ఛార్మి కి స్టార్ ప్రొడ్యూసర్ గా  గుర్తింపు తెచ్చిపెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: