ఫ్యాన్స్ ఈ హాట్ బ్యూటీ ఇంటికెళ్లి ఆమెని ఏం చేశారో తెలుసా?
వాళ్ళు కంగారు పెట్టిన హీరోయిన్ మరెవరో కాదు 'ఫ్యాషన్' 'హీరోయిన్' 'ఐయారి' 'బబ్లూ బ్యాచిలర్' వంటి సినిమాల్లో నటించిన హాట్ బ్యూటీ పూజా చోప్రా. ఈ విషయం గురించి ఇటీవల ఆమె ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. పూజా చోప్రా మాట్లాడుతూ..'2 నెలల క్రితం ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు నా కారుని ఫాలో అవుతూ మా ఇంటి వరకూ వచ్చేసారు.తర్వాత మా ఇంటి తలుపులు కొడుతూ నా పేరుతో పిలవడం మొదలుపెట్టారు. తీరా తలుపు తీశాక ఆటోగ్రాఫ్, సెల్ఫీ అంటూ నన్ను కంగారు పెట్టారు.
వాళ్ళు అవి అడిగినందుకు నాకు ఏమీ ఇబ్బంది లేదు. కానీ నా ఇల్లు కనుక్కుని మరీ వచ్చేసి ఇలా అడగడం నన్ను భయానికి గురి చేసింది.తర్వాత సెక్యూరిటీని ఆరాతీస్తే 'నాకు తెలీదు' అన్నాడు. దాంతో నేను అతన్ని తిట్టాను. అటు తరువాత సీసీ కెమెరాల్లో చూస్తే.. వాళ్ళు నా కారుని ఫాలో అవుతూ అపార్ట్మెంట్ లోపలి వరకూ వచ్చినట్లు తెలిసింది. ఆ సంఘటన నన్ను చాలా భయపెట్టింది' అంటూ ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది.అప్పుడప్పుడు ఇలాంటివి సెలబ్రిటీలకి జరుగుతూ ఉంటాయి.