ఆకట్టుకుంటున్న నాజర్ న్యూ లుక్ ?

VAMSI
సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ప్రజలకు ఇంటరెస్టింగ్ కాన్సెప్ట్ లతో సినిమాలు చేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం మన తెలుగు సినీ పరిశ్రమలో  బయోపిక్ లు, మరియు నిజ జీవిత ఆధారంగా సినిమాలు తెరకెక్కుతున్నాయి.  గతంలో క్రీడల నేపథ్యంలో వరుస చిత్రాలు రూపుదిద్దుకోగా ఈ మధ్య నిజ జీవిత కథల ప్రేరణతో రూపుదిద్దుకుంటున్న చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి.  ఇదే తరహాలో అడవిలో జరిగిన ఇన్సిడెంట్స్ ఆధారం చేసుకొని ప్రాణం పోసుకుంటున్న చిత్రం నల్లమల. రవిచరణ్ దర్శకత్వం వహిస్తుండగా, ఈ చిత్రంలో అమిత్ తివారి - భానుశ్రీ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. అలాగే నాజర్, తనికెళ్ళ భరణి  వంటి సీనియర్ యాక్టర్స్ ఆసక్తికర పాత్రలలో కనిపించబోతున్నారు. 


ఆర్ఎం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీ లోకి రీఎంట్రీ ఇచ్చిన ఆర్ పి పట్నాయక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండడం విశేషం. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ లో నాజర్ సైంటిస్ట్ లా ఏదో సీరియస్ గా పరిశోధిస్తున్నట్లు కనిపించారు. నాజర్ ఈ సినిమా లో ఓ ప్రముఖ శాస్త్రవేత్తగా కనిపించనున్న  విషయం తెలిసిందే. అయితే ఈ తాజా పోస్టర్ ద్వారా ఆయన పాత్ర పై మరింత ఆసక్తి పెరిగింది. 


అయితే ఈ నల్లమల అడవుల గురించి ఆయన ఎలాంటి పరిశోధనలు జరిపారు ? ఎలాంటి అనుభవాలను ఎదుర్కొన్నారు ?  ఏ విషయాలను కనుగొన్నారు అన్నది  ప్రస్తుతానికి సస్పెన్స్.  ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియా లో సందడి చేస్తూ ఈ సినిమాపై మరింత హైప్ ను క్రియేట్ చేస్తోంది. ఇక ఈ చిత్రంలో నల్లమల అడవుల గురించి లోతుగా చెప్పబోతున్నారు. జనాలకు తెలియని నల్లమల అడవులు విశేషాలను తెరపై చూపించబోతున్నారని సమాచారం. అయితే ఈ చిత్రం ఓటిటి లో విడుదల అవనుందా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: