ఆ ఇద్దరు ఫెయిల్యూర్ హీరోలతో ప్రముఖ వ్యాపార వేత్త ప్రయోగం !
బాలీవుడ్ లో మల్టీ స్టారర్ మూవీలలో నటించడానికి టాప్ హీరోలు అంతా ఆసక్తి కనపరుస్తారు. గతంలో అక్కినేని ఎన్టీఆర్ కృష్ణ శోభన్ బాబులు కలసి ఎన్నో సినిమాలలో నటించారు. ఆ తరువాత ఆ ట్రెండ్ కు బ్రేక్ పడింది. అయితే గత కొంతకాలంగా టాలీవుడ్ లో మల్టీ స్టారర్ ట్రెండ్ నడుస్తోంది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని టాప్ హీరోలు కూడ తమ ఈగోలు స్క్రీన్ స్పేస్ వంటి అంశాలని పక్కనపెట్టి ఇద్దరు స్టార్స్ ఒకే సినిమాలో కనిపించడానికి ఆసక్తి కనపరుస్తున్నారు. ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి నటిస్తూ ఉంటే ‘అయ్యప్పన్ కోషియమ్' తెలుగు రీమేక్ లో పవన్ కళ్యాణ్ రానాలు కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నా విషయం తెలిసిందే.
ఈ ట్రెండ్ ను కొనసాగిస్తూ ‘డ్రైవింగ్ లైసెన్స్’ లాంటి మరికొన్ని విభిన్న కథా చిత్రాలు మల్టీ స్టారర్స్ గా రాబోతున్నాయి. ఇలాంటి పరిస్థితులలొ మరో మల్టీస్టారర్ కి రంగం సిద్ధమవుతోంది అన్న వార్తలు వస్తున్నాయి. యాంగ్రీ మ్యాన్ గా ఒకప్పుడు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న రాజశేఖర్ యాక్షన్ హీరో గోపీచంద్ కాంబినేషన్ లో ఒక మల్టీస్టారర్ చేయడానికి రంగం సిద్ధం అయిందని వార్తలు వస్తున్నాయి.
‘లక్ష్యం’ 'లౌక్యం' ‘డిక్టేటర్’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ శ్రీవాస్ ఈ ఫెయిల్యూర్ హీరోల మల్టీస్టారర్ మూవీకి దర్శకత్వం వహిస్తాడని టాక్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడ మొదలయ్యాయి అంటున్నారు. సెకండ్ వేవ్ కోవిడ్ పరిస్థితులు అదుపులోకి వచ్చిన తరువాత ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన ఉంటుంది అంటున్నారు. గతంలో అనేక సక్సస్ ఫుల్ సినిమాలలో నటించిన రాజశేఖర్ గోపీచంద్ లు ప్రస్తుతం ఫ్లాప్ బాటలో కొనసాగుతున్నారు. గోపీచంద్ లేటెస్ట్ గా నటిస్తున్న ‘సిటీమార్’ సినిమా విడుదలకు రెడీగా ఉండగా రాజశేఖర్ ‘మర్మాణువు’ సెట్స్ పై ఉంది. ప్రస్తుతం మార్కెట్ లేని ఈ హీరోలను నమ్ముకుని ఆ ప్రముఖ వ్యాపార వేత్త చేస్తున్న సాహసం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది..