మళ్లీ మళ్లీ అలాంటి పాత్రలు చేయడం నావల్ల కాదు : రష్మిక
గీత గోవిందం సినిమా తో దర్శకుల చూపులు ఆకర్షించిన రష్మిక మందన ఇక ఆ తరువాత ఏకంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఇక రష్మిక, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈ అమ్మడు స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఇక ప్రస్తుతం వరుసగా స్టార్ హీరోల సినిమాలతో బిజీ బిజీగా గడుపుతుంది ఈ ముద్దుగుమ్మ. కేవలం తెలుగులో మాత్రమే కాదు తమిళ, కన్నడ సినిమాల్లో కూడా వరుసగా అవకాశాలు దక్కించుకుంటుంది.
అయితే చలో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వక ముందు తమిళ్లో కిరిక్ పార్టీ అనే సినిమాతో హీరోయిన్ గా మారింది రష్మిక మందన. ఈ సినిమాలు రక్షిత్ శెట్టి సరసన నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. అయితే ఇటీవలే సినిమాను హిందీలో రీమేక్ చేయాలని ప్లాన్ చేశారు. ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో నటించేందుకు రష్మిక మాత్రం నో చెప్పినట్లు తెలుస్తోంది. ఇక దీనిపై స్పందించిన రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎప్పుడూ ఒకే రకం పాత్రలు చేయడం తనకు ఇష్టం ఉండదని.. ఇక ఎప్పుడూ కొత్త పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రావాలి అని తాను ఎప్పుడూ అనుకుంటాను అంటూ చెప్పుకొచ్చారు.