బన్నీపై రుసరుసలాడుతున్న హీరోయిన్..
ఫస్ట్ పార్ట్ అంతా అడవుల్లో సాగితే, రెండో భాగం అంతా సిటీలో ఉంటుందని, ఎర్రచందనం డాన్ గా ఎదిగిన అల్లు అర్జున్, ఆ తర్వాత ఆ వ్యవహారాలన్నిటినీ సిటీ నుంచి నడిపిస్తారని, అలాంటి కథని రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. అంటే.. పల్లెటూరి గెటప్ లో కనిపించిన హీరోయిన్ రష్మిక సెకండ్ పార్ట్ లో కనిపించదనమాట. బాహుబలి సిరీస్ లో కూడా ఫస్ట్ పార్ట్ లో తమన్నా మెప్పిస్తే, సెకండ్ పార్ట్ లో అనుష్క అలరించింది. ఇప్పుడు పుష్ప లో కూడా అదే ఫార్ములా ఫాలో అవ్వాలనుకుంటున్నారట. సరిగ్గా ఇక్కడే రష్మిక డిజప్పాయింట్ అయిందని అంటున్నారు. హీరో అల్లు అర్జున్ కూడా రెండో హీరోయిన్ కే మొగ్గు చూపడంతో రష్మిక ఫీలయ్యారట. సెకండ్ పార్ట్ లో కూడా తనే లీడ్ హీరోయిన్ అనుకున్నానని, ఇప్పుడిలా అయిందని బాధపడుతున్నారట. పుష్ప సినిమా పేరు చెబితే, హీరోయిన్ గా తన పేరే వినపడాలని ఆమె అంటున్నారు. మరి రష్మిక మాటలకు హీరో, దర్శకుడు కరిగిపోతారా.. సెకండ్ పార్ట్ లో కూడా ఆమెనే లీడ్ హీరోయిన్ గా పెట్టుకుంటారా అనేది తేలాల్సి ఉంది.