ఆకాశంలో విహరిస్తున్న దేవిశ్రీ ప్రసాద్ వేదాంతం !
ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఎప్పటికి అదుపులోకి వస్తుందో ఎవరికీ ఎటువంటి క్లారిటీ లేని పరిస్థుతులలో ఎవరికి వారే భయంతో రోజులు గడుపుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో ప్రజలను కాపాడేందుకు దేవుడు ఎందుకు రావడంలేదు అని అనేకమంది నాస్తికులు అడుగుతున్న ప్రశ్నలకు దేవిశ్రీ కి సమాధానం దొరికింది. దీనితో ‘శివ ఇన్ ది స్కై’ ఆకాశంలో శివుడు అంటూ దేవిశ్రీ ప్రసాద్ తన ఇన్ స్టా లో షేర్ చేసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆకాశంలో నెలవంక పైన రెండు విభూతి నామం బొట్లు నేచురల్ గా ఏర్పడినట్లుగా రెండు చిన్న మేఘాలు శివుని రూపంలో కనిపుస్తున్న ఓక దృశ్యానికి సంబంధించిన ఫోటోను దేవిశ్రీ షేర్ చేస్తూ లోకాన్ని కాపాడేందుకు పరమశివుడు వచ్చేసాడు అంటూ కామెంట్స్ చేసాడు. ఈ కామెంట్లను అనేకమంది నెటిజన్లు స్వాగతిస్తూ శివుడు కైలాసం నుండి వస్తూ భారతదేశానికి 130 కోట్ల వ్యాక్సిన్ రెండు డోసులు తెస్తే ఎంత బాగుటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ కామెంట్స్ లో హాస్యం కనిపిస్తున్నా జనం కరోనా వ్యాక్సిన్ కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో అర్థం అవుతుంది. వ్యాక్సిన్ లు చాల సులువుగా అందుబాటులో ఉన్నప్పుడు వాటిని పట్టించుకోని ప్రజలు ఇప్పుడు వ్యాక్సిన్స్ కు కొరత ఏర్పడటంతో ఇప్పుడు అనుక్షణం వ్యాక్సిన్ నామజపం చేస్తున్నారు. మనిషి ఎప్పుడు ఉన్నప్పుడు చులకన చేస్తూ లేనప్పుడు ఆ వస్తువు గురించి ఎంత ఎక్కువ ఆరాట పడతాడు అన్న దానికి ఇదే ఉదాహరణ..