ఈ ఏడాది మోగనున్న పెళ్లి బాజాలు..!
ఇండస్ట్రీలో విఘ్నేష్‌శివన్, నయనతారను ప్రేమ పావురాలుగా అభివర్ణిస్తారు. ఐదేళ్ల ప్రణయబంధంలో ఈ జంట మధ్య చిన్న మనస్పర్ధ కూడా రాలేదని వారి సన్నిహితులు చెబుతుంటారు. పరస్పరం విశ్వాసం, అనురాగం తోడుగా వీరి ప్రేమప్రయాణం సాఫీగా సాగిపోతోంది. విదేశాల్లో షికార్లు మొదలుకొని, కేరళలోని ఓనం వేడుకల్లో కలిసి పాల్గొనడం వరకు ఈ ప్రేమపక్షులు ఎప్పు డూ వార్తల్లో నిలుస్తుంటారు.
అయితే గత ఏడాది ప్రథమార్ధంలోనే ఈ జంట వివాహానికి సిద్ధమయ్యారు. తాజా సమాచారం ప్రకారం వీరిద్దరు సెప్టెంబర్‌లో పెళ్లిపీటలెక్కనున్నారని తెలిసింది. కరోనా సెకండ్‌వేవ్ సద్దుమణిగిన తర్వాత కుటుంబ సన్నిహితులు, ఇండస్ట్రీ మిత్రుల సమక్షంలో వైభవంగా వివాహ వేడుకను జరుపుకోవాలని నిర్ణయించుకున్నారట. హిందూ, క్రిష్టియన్ సంప్రదాయ పద్దతుల్లో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
శృతుహాసన్ ఆర్టిస్టు శంతను హజారికాతో కొన్ని నెలలుగా సహజీవనం సాగిస్తోంది శృతిహాసన్. అతను అద్భుతమైన ప్రతిభావంతుడని, ప్రియుడి సాంగత్యంలో జీవితంలో కొత్త కాంతుల్ని చూస్తున్నానని పొగడ్తలతో ముంచెత్తుతోంది. కుటుంబ సభ్యులతో చర్చించి ఈ ఏడాదే ఏడడుగులు వేయాలని నిర్ణయించుకుందని అంటున్నారు. పంజాబ్ రాజకీయ కుటుంబానికి చెందిన భవ్య బిష్ణోయ్‌తో మార్చి 12న మెహరీన్ నిశ్చితార్థం జైపూర్‌లో వైభవంగా జరిగింది. వీరి వివాహానికి కరోనా బ్రేక్ వేయడంతో వాయిదా వేసుకున్నారు. అవికాగోర్ రియాల్టీ అడ్వంచర్ షో ఏంటీవీ రోడీస్ పార్టిసిపాంట్ మిలింద్ చద్వానీతో ఈ ముద్దుగుమ్మ ప్రేమాయణాన్ని సాగిస్తోంది. ఇప్పుడే పెళ్లి గురించి ఆలోచించడం లేదు. అయితే భవిష్యత్తులో మాత్రం వివాహబంధంతో మా జీవితాల్ని పరిపూర్ణం చేసుకుంటాం’ అని అవికాగోర్ చెప్పింది.