సోనమ్‌ భర్త ఆస్తి విలువ అన్ని కోట్లా..?

Suma Kallamadi
ప్రేమ్ రతన్ ధన్ పాయో, నీర్జా, ఢిల్లీ-6, మౌసం, భాగ్ మిలఖా భాగ్, రాంజానా వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి భారత దేశ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించిన సోనమ్‌ కపూర్‌ తన వివాహ వేడుకలను కళ్లుచెదిరే రీతిలో అంగరంగ వైభవంగా జరుపుకుని అందరినీ అబ్బురపరిచారు. ఆమె పెళ్లి కోసం ప్రత్యేకంగా ఒక సాంగ్ కూడా రూపొందించి బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలా ఉత్సాహమైన వాతావరణాన్ని నెలకొల్పారు. సోనమ్‌ కపూర్‌.. ప్రముఖ సీనియర్ బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ కి కూతురు అవుతారు. ఆయనకు "అనిల్ కపూర్ ఫిలిమ్స్ కంపెనీ" నిర్మాణ సంస్థ కూడా ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే సోనమ్‌ కపూర్‌ కోటీశ్వరుల కుటుంబంలో జన్మించారు.

అయితే ఈ ముద్దుగుమ్మ కోటీశ్వరుల ఇంట్లో జన్మించి కోటీశ్వరుడినే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమె భర్త పేరు ఆనంద్ అహుజ కాగా.. షాహీ ఎక్సపోర్ట్స్ కి ఆయన మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. షాహీ ఎక్సపోర్ట్స్ భారతదేశంలో వస్త్రాలను ఎక్సపోర్ట్స్ చేసే అతిపెద్ద కంపెనీగా పేరుగాంచింది. ఈ కంపెనీకి సంబంధించి 9 రాష్ట్రాల్లో 65 ఫ్యాక్టరీలు, 3 ప్రాసెసింగ్ మిల్లులు ఉండగా.. లక్ష మందికి పైగా ఉద్యోగులు, వారిలో 65 వేలకు పైగా మహిళలు ఉన్నారు. ఈ కంపెనీ బిజినెస్ వార్షికంగా రూ.3 వేల కోట్లకు పైగా జరుగుతుంది. ఆనంద్ అహుజ నికర ఆదాయం రూ.5 వేల కోట్లకు పైచిలుకు ఉంటుందని అంచనా.


ఆనంద్ అహుజ "భానే" అనే ఒక ఫ్యాషన్ బ్రాండ్ కూడా స్థాపించారు. అలాగే స్నికర్స్ కంపెనీ కూడా ఆయన ప్రారంభించారు. తండ్రి వ్యాపారాలతో పాటు తాను సొంతంగా స్థాపించిన రెండు కంపెనీల బిజినెస్ వ్యవహారాలు ఆనంద్ అహుజా చూసుకుంటున్నారు. ఢిల్లీలో ఆయనకు 9000 చదరపు మీటర్ల లో 170 కోట్ల విలువ చేసే భారీ బంగ్లా ఉంది. ఈ విధంగా చూసుకుంటే.. సోనమ్‌ కపూర్ భర్త అత్యంతధనవంతుడు అని నిస్సందేహం గా చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: