ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ డూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మేకర్స్ ఈ సిరిస్ కు కొనసాగింపుగా ఫ్యామిలీ మ్యాన్ 2 ను తెరకెక్కించారు. ఈ వెబ్ సిరీస్ లో సమంత, మనోజ్ బాజ్ పాయి కీలక పాత్రల్లో నటించారు. ఇక తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ను విడుదల చేయగా పాజిటివ్ రెస్పాన్స్ తో పాటు నెగిటివ్ రెస్పాన్స్ కూడా వస్తోంది. "ఎల్‌టిటిఇ ఈజ్ టెర్రరిస్ట్్స" అని చూపించడం పై కొంతమంది నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ విడుదలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతే కాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియో చాలా సున్నితమైన మరియు తప్పుడు విషయాన్ని తీసుకుని వివాదాస్పదం చేస్తోందని మండి పడుతున్నారు. వెంటనే తమిళులు అమెజాన్ ప్రైమ్ ను డిలీట్ చేయాలని వరుస ట్వీట్స్ చేస్తున్నారు. తమిళులకు అమెజాన్ ప్రైమ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ట్రైలర్ విడుదల చేసిన వెంటనే ఫ్యామిలీ మ్యాన్ 2 అగైనిస్ట్ టూ తమిళియన్స్ అంటూ ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు.
అంతే కాకుండా ఈ వెబ్ సిరీస్ లో సమంత ఎల్‌టిటిఇ కి చెందిన మూనిఫాం ను ధరించి కనిపిస్తోంది. అంతే కాకుండా సమంత ఈ సిరీస్ లో విలన్ పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ట్రైలర్ లో సమంత ఒక్కదాన్నే వెళ్లి అందరినీ చంపేస్తా అంటూ డైలాగులు కొడుతోంది. దాంతో సమంత పై కూడా నెటిజన్లు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షేమ్ ఆన్ యూ సమంత అంటూ ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. ఇలాంటి పాత్రను ఎలా ఒప్పుకున్నావంటూ సమంతను ప్రశ్నిస్తున్నారు. ఒక్క సమంతపైనే కాకుండా సిరీస్ లో నటించిన మనోజ్ బాజ్ పాయి మరియు దర్శక నిర్మాతల పై కూడా ఫైర్ అవుతున్నారు. గంగానదిలో శవాలు తేలుతున్నాయని దానిపై ఎందుకు వెబ్ సిరీస్ తీయడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ వివాదం పై మేకర్స్ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.