సెలబ్రెటీల పెళ్లి వయసు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకపోతే వారికి ఎదురయ్యే మొదటి ప్రశ్న పెళ్లెప్పుడు..? అంతే కాకుండా వారు పెళ్లి పీటలెక్కేవరకు రకరకాల వార్తలు చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం టాలీవుడ్ లో అనుష్క పెళ్లి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అప్పట్లో అనుష్క ప్రభాస్ ప్రేమలో ఉన్నారని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు రాగా స్వీటీ వాటికి పులిస్టాప్ పెట్టింది. ఆ తరవాత బిజినెస్ మ్యాన్ తో అనుష్క పెళ్లి అంటూ మరికొన్ని వార్తలు రాగా అవి కూడా గాలి వార్తలేనని తేలింది. ఇక ఇప్పుడు మరోసారి అనుష్క పెళ్లి టాపిక్ తెరపైకి వచ్చింది. అయితే ఈసారి పెళ్లి వార్తలు రావడానికి మాత్రం అనుష్కనే కారణం. గతేడాది అందాల చందమామ కాజల్ అగర్వాల్ తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు సెలబ్రెటీలు కరోనా కారణం గా పెళ్లికి హాజరవ్వలేకపోయారు .
కానీ సోషల్ మీడియాలో కాజల్ కు విషెస్ చెప్పారు. అయితే స్వీటీ అనుష్క కూడా కాజల్ కు సోషల్ మీడియా ద్వారా విషెష్ చెప్పింది. అయితే ఆ సమయంలో బిజీగా వుండి రిప్లై ఇవ్వలేకపోయిన కాజల్ తాజాగా అనుష్క ట్వీట్ కు రిప్లై ఇచ్చింది. అయితే అనుష్క తన పోస్ట్ లో పెళ్లి గొప్పతనాన్ని వివరిస్తూ ట్వీట్ చేసింది. "భూమిపై ఎక్కువ ఆనందాన్ని పొందే సమయం పెళ్లి చేసుకోవడం. రెండు మనసులు ఒక్కటవుతాయి. రెండు హృదయాలు ఒకేలా కొట్టుకుంటాయి..మీ ఇద్దరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు" అంటూ అనుష్క పేర్కొంది. ఇక అనుష్క ట్వీట్ కు కాజల్ తాజాగా రిప్లై ఇవ్వడంతో మళ్లీ స్వీటీ పెళ్లి తెరపైకి వచ్చింది. దాంతో నెటిజన్లు అనుష్క మీ పెళ్లి ఎప్పుడు..? అంటూ ప్రశ్నలు మొదలు పెట్టారు .