ఎన్టీఆర్ పాడిన పాటలు ఏంటో తెలుసా.. పరభాషలోనూ ప్రయోగం..!!

P.Nishanth Kumar
నందమూరి నట వారసుడు ఎన్టీఆర్ పుట్టిన రోజు ఈరోజు కావడంతో అయన అభిమానులు భారీగా సందడి చేస్తున్నారు. అయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది..గత వారం రోజులుగా అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్ డే హ్యాష్ టాగ్స్ తో ఎన్టీఆర్ పై ఉన్న ప్రేమను తెలపగా నేడు మాత్రం అభిమానుల ఆనందానికి అంతులేదు. ఈరోజు ఎన్టీఆర్ నటించబోయే సినిమాల అప్ డేట్స్ వస్తాయని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు..
ఎన్టీఆర్ ని నటన విషయంలో ఎవరు తీసిపారేయలేరు అన్న విషయం అందరికి తెలిసిందే.. టాలీవుడ్ లోనే కాదు సౌత్ లోనే ఎన్టీఆర్ లా నటించే హీరో లేడన్నది అభిమానులు చెప్తున్నా మాట..నిజానికి అదే నిజం.. ఇప్పటితరం లో ఎన్టీఆర్ ను నటనలో కొట్టే హీరో అయితే లేడు.. డాన్స్ లు చేయడంలోనూ ఎన్టీఆర్ మంచి ప్రతిభను కనపరిచాడు.. డాన్స్ చేయడం కోసం కొంచెం లావుగా ఉన్న ఎన్టీఆర్ సన్నగా మారి ఎంతో బాగా డాన్స్ చేసి ప్రేక్షకులను మెప్పించాడు.. నటన లో తాతకు తగ్గ మనవడు అనిపించుకున్న ఎన్టీఆర్, డాన్స్ లో బాబాయ్ నే మించిపోయాడు..
అయితే ఎన్టీఆర్ లో తెలియని మరో కోణం ఉందని తెలిసి అభిమానులు ఎంతో సంతోషపడ్డారు.. అయన పాడగలడు అని తెలిసి అభిమానులుతో పాటు ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోయారు. ఒకసారి ఎన్టీఆర్ ఆలపించిన పాటలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. మొత్తం ఆరుపాటలను పాడిన ఎన్టీఆర్ మొదట యమదొంగ చిత్రంలోని ఓలమ్మి తిక్కరేగిందా పాట పాడారు.. ఆ తర్వాత కంత్రి టైటిల్ సాంగ్, అదుర్స్ లో చారీ సాంగ్, రభస లో రాకాసి రాకాసి సాంగ్, నాన్నకు ప్రేమతో లో ఫాలో యు , కన్నడ సినిమా చక్రవ్యూహ లో ఓ పాటను పాడి అభిమానులను అలరించాడు.. మరి భవిష్యత్ లో ఇంకెన్ని పాటలతో అలరిశాడో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: