ఆ హీరో సినిమా కోసం ఎదురు చూస్తున్న వార్నర్...

Purushottham Vinay
డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండియాలో ఏ ఫారెన్ హీరోకి కాని ఫారెన్ క్రికెటర్ కి గాని లేని సూపర్ క్రేజ్ డేవిడ్ వార్నర్ కి వుంది.ఇక ఐపీయల్ టీం సన్ రైజర్స్ హైదరాబాద్ టీం సభ్యుడిగా వార్నర్ అందరికి గుర్తుండిపోయాడు. కొంతమందికి అయితే వార్నర్ విదేశీ ఆటగాడు అనే ఫీలింగే రాదు. అంతలా కలిసిపోయాడు వార్నర్. మన సౌత్ ఇండియా హీరోల సాంగ్స్ ని టిక్ టాక్ చేస్తూ దేశమంతటా తెగ వైరల్ అయ్యాడు.అసలు అల్లు అర్జున్ బుట్టబొమ్మ సాంగ్ అంత పెద్ద వైరల్ హిట్ అవ్వడానికి కారణం పూర్తిగా డేవిడ్ వార్నర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. డేవిడ్ వార్నర్ ఆ సాంగ్ తో టిక్ టాక్ వీడియో చెయ్యటం వలన అది బాగా వైరల్ అయ్యి పెద్ద హిట్ గా నిలిచి దేశవ్యాప్తంగా ట్రెండ్ అయ్యింది.ఇక అలాగే ఇంకా కొన్ని పాటలను టిక్ టాక్ చేసి బాగా ఫేమస్ అయ్యాడు వార్నర్.


ఇక వార్నర్ ఎంత గొప్ప క్రికెటర్ అయినా కాని ఒదిగి ఉంటాడు. ఇక వార్నర్ రజినీకాంత్, మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్స్ ల వీడియోలు ఫేస్ యాప్ ద్వారా చేసి బాగా ఫేమస్ అయ్యాడు.ఇక కేజిఎఫ్ దేశవ్యాప్తంగా ఎన్ని సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.బాహుబలి లాగే పాన్ ఇండియా లెవెల్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఆ రేంజ్ అంచనాలతోనే కేజిఎఫ్ 2 రాబోతుంది. ఇక రిలీజ్ చేసిన టీజర్ ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండియన్ సినిమాలలో ఏ సినిమా సాధించనటువంటి రికార్డ్స్ ఈ ఒక్క టీజర్ సాధించడం గ్రేట్ అని చెప్పాలి. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందో నని వార్నర్ వెయిట్ చేస్తున్నాడట.ఇక ఈ సినిమా టీజర్ చూసిన వార్నర్ దానికి బాగా ఫిదా అయిపోయాడట.ఇక ఆల్రెడీ ఈ టీజర్ ని కూడా డేవిడ్ వార్నర్ తన స్టైల్ లో చెయ్యడం జరిగింది. ఇక రౌడీ బేబీ సాంగ్ తో కూడా వార్నర్ నిన్నటినుంచి సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: