ఆ వీడియో లీక్ అవడంతో బయటకే రాలేదు.. రాధిక అప్టే..!!
ఈ తరం నటీమణులు ఎలాంటి పాత్రలు చేయడానికైనా సిద్ధం గా ఉన్నారు.. యాక్టింగ్ అంటే ఈ తరం నటీమణుల్లో ఎంతటి ప్యాషన్ ఉందో అర్థం చేసుకోవచ్చు.. చాలామంది యాక్టింగ్ కోసం ఎన్నో రకాలుగా నటించి ప్రేక్షకులతో శభాష్ అనిపించుకున్నారు.. అలాంటి నటీమణుల్లో ఒకరు రాధికా ఆప్టే.. కోలీవుడ్ లో రాధికా ఆప్టే కు నటిగా మంచి పేరు తో పాటు బోల్డ్ స్టేట్మెంట్స్ చేసే సెలెబ్రెటీగా పెద్ద పేరే ఉంది.. ఎలాంటి స్టేట్మెంట్స్ చేయడానికైనా ఏమాత్రం వెనుకాడదు.ఇండియా లోని అన్ని ఇండస్ట్రీ లను కవర్ చేసి హాలీవుడ్ లో సైతం నటించే రాధికా ఆప్టే నటన పై తనకు ఉన్న ఆసక్తి ని ఎన్నడూ వీడలేదు.
ఎప్పటికప్పుడు వైవిధ్యంగా ఉన్న కథలను ఎంచుకుంటూ అందరి హీరోయిన్ లకంటే తాను డిఫరెంట్ అని చెప్తుంది. తెలుగులో పలు సినిమాలు చేసిన రాధికా సంచలన ఆరోపణలకు కూడా కేరాఫ్ అడ్రస్.. దక్షిణాదిన హీరోయిన్ లకు విలువలేదని బహిరంగంగా చెప్పి బాలీవుడ్ కి వెళ్ళిపోయి అక్కడ పలు ప్రాజెక్ట్ లతో బిజీ గా ఉంది. అవసరమైతే నగ్నంగా నటించడానికైనా సిద్ధమేనని చెప్పే నటి ఈమె ఒక్కరే కావచ్చు.. ఎప్పుడు ఎదో ఒక కాంట్రవర్సీ చేసే ఈ ముద్దుగుమ్మ తాజాగా గతంలో ఆమెకు సంబంధించిన ఓ న్యూడ్ క్లిప్లింగ్ సోషల్ మీడియాలో వైరల్ అయిందని నాలుగు రోజులు బయటకు రాలేదట..
సెక్స్ వర్కర్‌గా రాధిక ఆప్టే నటించిన 'పార్చ్‌డ్' చిత్రం అప్పట్లో వివాదాస్పదమైంది. ఆ సమయంలోనే ఆమెకు సంబంధించి ఓ న్యూడ్ వీడియో క్లిప్పింగ్ వైరల్ కావడంతో షాకైన రాధికా ఆప్టే.. తన ఫేస్‌తో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో తనది కాదని 2016లోనే క్లారిటీ ఇచ్చారు.. అయితే తాజాగా మరోసారి అదే అంశంపై మాట్లాడి వార్తల్లో నిలిచారు రాధిక ఆప్టే. ఆ న్యూడ్ వీడియో బయటికి వచ్చిన సమయంలో ఎంతోమంది ఎన్నోరకాలుగా మాట్లాడారని, ట్రోల్ చేశారని చెబుతూ రాధిక ఆవేదన చెందారు. ఊహించని విధంగా తలెత్తుకోలేని పరిస్థితి ఎదురుకావడంతో నాలుగు రోజులు నేను బయట అడుగుపెట్టలేకపోయాను. ఎంతో మానసిక వేదన అనుభవించాను. అయితే పార్చడ్ చిత్రంలో నటించినందుకు తనకు చాలా సంతోషంగా ఉందన్నారు’’ రాధిక.