రాధే ప్రయోగం ఫెయిల్యూర్ తో అంతర్మధనంలో ఇండస్ట్రీ వర్గాలు !
రంజాన్ సందర్భంగా మొదటిసారి ప్రయోగాత్మకంగా ‘పే పర్ వ్యూ’ పద్ధతిలో విడుదల చేసిన ‘రాథే’ ఘోరమైన ఫ్లాప్ గా మారడంతో సల్మాన్ ఖాన్ కు అవమానం ఈమూవీని రిలీజ్ చేసిన జీ5 జీప్లెక్స్ సంస్థలకు భారీ నష్టాలు రావడంతో ఇక ఇప్పట్లో ‘పే పర్ వ్యూ’ పద్ధతికి టాప్ హీరోల సినిమాలు రిలీజ్ అయ్యే సాహసం చేయకపోవచ్చు అన్నఅంచనాలు వస్తున్నాయి.
వాస్తవానికి దేశవ్యాప్తంగా చాల రాష్ట్రాలలో లాక్ డౌన్ కొనసాగుతున్న నేపధ్యంలో ఈమూవీ రిలీజ్ కు ముందు ఏర్పడిన మ్యానియాతో ఈమూవీకి కనీసం మొదటివారంలో 500 కోట్ల కలక్షన్స్ వస్తాయని జీ సంస్థ భావించి ఈమూవీని 200 కోట్లకు సల్మాన్ ఖాన్ తమ్ముడు నుంచి ఈమూవీ రైట్స్ ను కొనుగోలు చేసింది అన్న వార్తలు ఉన్నాయి. ఈమూవీ మొదటిరోజున ఏర్పడిన క్రేజ్ తో ఏకంగా జీ5 సర్వర్ క్రాష్ అవ్వడం చూసినవారు ఖచ్చితంగా ఈమూవీ ప్రపంచ వ్యాప్తంగా మొదటివారం పూర్తి అయ్యేసరికి 500 కోట్లు కలెక్ట్ చేస్తుందని అంచనాలు కట్టారు అయితే జరిగిన వాస్తవం వేరు.
ఈమూవీకి భయంకరమైన నెగిటివ్ టాక్ రావడంతో ఈమూవీని ఓటీటీ లో రెండవ రోజు నుండే చూసేవారు కరువైపోయారు. అయితే ఇదే మూవీ ధియేటర్లలో విడుదలై ఉంటే సల్మాన్ ఖాన్ కు దేశవ్యాప్తంగా ఉండే బిసి సెంటర్ల మాస్ ప్రేక్షకులలో ఉండే క్రేజ్ రీత్యా ఈమూవీకి మరీ ఇంత భయంకరమైన కలక్షన్స్ వచ్చి ఉండేవి కావని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
దీనికితోడు టాప్ హీరోల సినిమాలు అంటే ఒక వారం రోజుల ముందుగా అడ్వాన్స్ టిక్కెట్ల బుకింగ్ ఓపెన్ అయి కనీసం మొదటి మూడు రోజులు ధియేటర్లు నిండిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉండేది. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా ధియేటర్లు మూత పడటంతో కేవలం ఓటీటీ ప్రేక్షకులను నమ్ముకుని ‘రాథే’ ను విడుదల చేసారు. ఈమూవీకి వచ్చిన కలక్షన్స్ పరిశీలించిన ఇండస్ట్రీ వర్గాలు ధియేటర్ల సపోర్ట్ లేకుండా కేవలం ఓటీటీ లలో ‘పే పర్ వ్యూ’ విధానాన్ని నమ్ముకుని విడుదల చేస్తే ‘రాథే’ కి ఏర్పడిన పరిస్థితి మిగతా భారీ సినిమాలకు కూడా ఏర్పడే ఆస్కారం ఉంది అంటూ హెచ్చరిస్తున్నారు..