వర్మ ప్రేమకు 'మూడు' గంటలు..
వివరాల్లోకి వెళితే.. పెళ్లి, ప్రేమ, సెక్స్ లాంటి విషయాలు ప్రస్తావనకు వస్తే చెలరేగిపోతుంటారు వర్మ. అందులోనూ ఇంటర్వ్యూ చేసేది అమ్మాయి అయితే వర్మలోని రసికుడు తన్నుకుంటూ బయటకు వచ్చేస్తాడు.అయితే వర్మని ఇంటర్వ్యూ చేయడం ద్వారా పాపులర్ అయిన యాంకర్లు చాలామందే ఉన్నారు. వాళ్లంతా పెళ్లి, ప్రేమ, సెక్స్ తదితర విషయాలపై వర్మని కెలికి మరీ క్రేజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ యాంకర్ మాత్రం డైరెక్ట్‌గా వర్మ ముందే పెళ్లి ప్రపోజ్ పెట్టేసి.. మీ కళ్లు బాగుంటాయి.. మీరు హీరో అవ్వాల్సిన వాళ్ళు ఇలా అవ్వడం ఏదోలా ఉంది అంటూ వర్మ పై పొగడ్తల వర్షం కురిపించింది.
ఆ విషయం పై వర్మ ఏమన్నారంటే.. ‘పెళ్లి అంటే అది చాలా డిఫరెంట్. నేను పెళ్లి చేసుకున్నా అని సొసైటీకి తెలియడానికి తాళి, గీలి లాంటి నాన్సెన్స్ చాలా ఉంటాయి. ఇది కాకుండా మనిద్దరి మధ్య అనేది కూడా ఒకటి ఉంటుంది. మూడోది ఏంటంటే.. నేను ఒకప్పుడు స్త్రీని ప్రేమించేవాడిని. ఇప్పుడు స్త్రీలని ప్రేమిస్తా. స్త్రీ జాతిని ప్రేమిస్తా.. స్త్రీ జాతిలో మీరు కూడా ఉన్నారు కాబట్టి.. నా హృదయం చాలా విశాలం. అందుకే ఒకే అమ్మాయిని నేను చేసుకోను.. నాకు మూడు గంటలు మాత్రమే కావలి అంటూ యాంకర్ కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు.. ఇది కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..