రాఘవేంద్రరావు కుటుంబం నుంచి వచ్చిన సినిమా వాళ్ళు వీరే..?

Suma Kallamadi
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక గొప్ప దర్శకుడి గా వెలుగొందిన కె.రాఘవేంద్రరావు శ్రీదేవివిజయశాంతి, రాధ, రమ్యకృష్ణ వంటి తారలకు మంచి సినీ జీవితాన్ని ప్రసాదించారు. ఎన్టీఆర్చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి ఎందరో అగ్రహీరోలకు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందించారు. భక్తి రస చిత్రాలను కూడా అద్భుతంగా తెరకెక్కించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. ఆయన సినిమా పరిశ్రమకు అందించిన సేవలు చిరస్మరణీయం.

నిజానికి రాఘవేంద్ర రావు మాత్రమే కాదు ఆయన కుటుంబ సభ్యులు కూడా సినిమా పరిశ్రమలో కొనసాగారు. ఆయన కుటుంబం నుంచి మొత్తం నలుగురు సినీ రంగ ప్రవేశం చేశారు. ఆయన తండ్రి కోవెలమూడి ప్రకాశరావు దర్శకుడిగా కొనసాగారు. ప్రకాష్ రావు.. అక్కినేని నాగేశ్వరరావు తో కలిసి ప్రేమ్ నగర్, సెక్రటరీ వంటి అపురూప చిత్రాలను రూపొందించారు. అయితే రాఘవేంద్రరావు తల్లి గరికపాటి వరలక్ష్మి గులేబకావళి, దొంగల్లో దొర వంటి చాలా తెలుగు చిత్రాల్లో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ఆమె పలు తమిళ చిత్రాల్లో కూడా నటించారు. ఆమె మూగజీవులు అనే సినిమాకి డైరెక్టర్ గా కూడా వ్యవహరించారు.

రాఘవేంద్రరావు తమ్ముడు కోవెలమూడి బాపయ్య తెలుగు, హిందీ భాషల్లో మొత్తం 80 కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయన తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్స్ అయిన సినిమాలను హిందీలో రూపొందించేవారు. రాఘవేంద్రరావు కుమారుడు కూడా మూవీ ఇండస్ట్రీ లో అడుగు పెట్టి దర్శకుడిగా రెండు సినిమాలను తెరకెక్కించారు. రొటీన్ సినిమాలకు భిన్నంగా ఆయన రెండు చిత్రాలు రూపొందించారు కానీ అవి డిజాస్టర్స్ అయ్యాయి. తన తండ్రి లాగా సినిమా ఇండస్ట్రీ లో మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకోవడానికి ప్రకాష్ కోవెలమూడి ప్రస్తుతం ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా చూసుకుంటే రాఘవేంద్రరావు కుటుంబ సభ్యులు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎంతగానో సేవలందించారని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: