స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు తివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అదుర్స్ అనిపించేలా ఉంటుంది. అల్లు అర్జున్‌తో జులాయ్,సన్ ఆఫ్ సత్యమూర్తి,అలా వైకుంఠపురంలో సినిమాలను తీశాడు.గతేడాది సంక్రాంతికి అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన అల వైకుంఠపురములో సినిమా ఎంత పెద్ద హిట్టయిందో అందరికి తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు సంచలనం సృష్టించాయి.బుట్టబొమ్మ సాంగ్ మాత్రం తెలుగులో ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది.మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కెరీర్‌లోనే అతి పెద్ద హిట్ ఈ ఆల్బమ్. సినిమా పరంగా దుమ్ము దులిపేసిన అల వైకుంఠపురములో పాటల విషయంలో కూడా సంచలనం సృష్టించింది. త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ చిత్రం దాదాపు రూ. 150 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి 2020 టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాలోని సామజవరగమన, రాములో రాములా పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.2020లో ఇండియా టాప్ 10 సాంగ్స్ లిస్టులో ఉన్న ఏకైక తెలుగు చిత్రం కూడా అల్లు అర్జున్, త్రివిక్రమ్ అల వైకుంఠపురములో సినిమా కావడం విశేషం.రామజోగయ్యశాస్త్రి రాసిన బుట్టబొమ్మ సాంగ్ బాగా పాపులర్ అయ్యింది. ఈ పాట మొదట్లో కాస్త నెమ్మదిగానే అనిపించినా.. ఆ తర్వాత మాత్రం దుమ్ము దులిపేసింది.టిక్ టాక్, డబ్ స్మాష్ ఎక్కడ చూసినా కూడా బుట్టబొమ్మ పాటే దర్శనమిచ్చింది. ఇప్పుడు ఈ పాట మరో సంచలన రికార్డు అందుకుంది. యూట్యూబ్‌లో సెన్సేషనల్ హిట్టై ఏకంగా 600 మిలియన్ వ్యూస్ సాధించింది. ఆగస్ట్ 1న 300 మిలియన్ క్లబ్బులోకి అడుగు పెట్టిన బుట్టబొమ్మ.. మరో 200 మిలియన్స్ అందుకోడానికి నాలుగు నెలల సమయం తీసుకుంది. త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన మరో రెండు చిత్రాలు జులాయి,సన్ ఆఫ్ సత్యమూర్తి.ఈ రెండు చిత్రాలు కూడా అల్లు అర్జున్‌కు హిట్ తెచ్చాయి.యాక్షన్‌తో పాటు కామెడీ కూడా ఈ సినమాల్లో ఉంది.హీరోకి తగ్గట్టు పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలను తీయడంలో దిట్ట.అల్లు అర్జుతో తీసిని మూడు సినిమాలు కూడా అదుర్స్ అనిపిస్తాయి.వీరిద్దరి కాంబినేషన్ అంటే మెగా ఫ్యాన్స్‌కి పండగే.అయితే త్వరలో అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని మెగా అభిమానలు వెయ్యి కళ్లతో చూస్తున్నారు