క్రికెట్ లెజెండ్ బయోపిక్ అప్పుడే..!
బాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ కబీర్ ఖాన్ ఇందుకు శ్రీకారం చుట్టాడు. ఈ మేరకు లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ తీస్తున్నాడు. ఇప్పటికే ఎంతో మంది క్రికెటర్లు, ఇతర రంగాల ప్రముఖుల బయోపిక్‌లు వచ్చి మంచి విజయం సాధించాయి. ఇప్పుడు కపిల్ దేవ్ సినిమాను కబీర్ ఖాన్ తెస్తున్నాడు. అయితే అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ సినిమాని జులై లాస్ట్ వీక్ లో విడుదల చేయనున్నారు.
ఎలాగూ అప్పటి వరకు దేశంలో కరోనా సెకెండ్ వేవ్ కూడా గ్గుతుందని మూవీ టీమ్ అంచనా వేస్తోంది. కరోనా కారణంగా షూటింగ్ లేట్ కావడంతో ఇప్పటికే అనేక సార్లు విడుదల తేదీని వాయిదా వేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు కూడా కరోనా తీవ్రత అధికంగా ఉంది. మరి ఇలాంటి టైమ్‌లో జులైలో రిలీజ్ అవుతుందో లేదో అంటూ వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ బయోపిక్‌ను తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో అక్కినేని నాగార్జున విడుదల చేస్తున్నారు. ఈ మూవీని 83 అనే టైటిల్ తో తీస్తున్నారు కబీర్ ఖాన్. 1983లో వెస్ట్ ఇండీస్ పై ఇండియా ఫైనల్ లో గెలిచిన సన్నివేశాలు హైలెట్ కానున్నాయి. కాగా ఈ మూవీలో కపిల్ భార్య పాత్రలో దీపికా పదుకొనె నటిస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.