డ్యాన్సర్లకు ఆ హీరో సాయం..?

Suma Kallamadi
బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ప్రస్తుతం సూర్య‌వంశి, బెల్ బాట‌మ్ చిత్రాల్లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమాల విడుద‌ల తేదీల‌ను మాత్రం ప్ర‌క‌టించ‌లేదు. కానీ విడుద‌లపై పుకార్లు తెర‌పైకి వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో అక్ష‌య్‌కుమార్ త‌న అభిమానుల‌కు క్లారిటీ ఇచ్చాడు. త‌న సినిమాల ప‌ట్ల అభిమానులు ఎక్జ‌యిటింగ్ గా ఎదురుచూస్తుండ‌టం నాపై చూపిస్తున్న ప్రేమ‌కు నిద‌ర్శ‌నం. నా సినిమాల విడుద‌ల గురించి ఎదురుచూస్తున్న అభిమానులు మ‌న‌స్ఫూర్తిగా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నా. సూర్య‌వంశి, బెల్ బాట‌మ్ చిత్రాలు ఇండిపెండెన్స్ డే కానుక‌గా విడుద‌ల‌వుతున్నాయి. రెండు చిత్రాల నిర్మాత‌లు విడుద‌ల తేదీల‌పై క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. స‌రైన స‌మ‌యంలో సినిమాల విడుద‌ల ఎప్పుడ‌నేది ప్ర‌క‌టిస్తార‌ని క్లారిటీ ఇచ్చాడు. అక్ష‌య్ నుంచి ప్ర‌క‌ట‌న రావ‌డంతో ఆనందంలో మునిగిపోతున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉండగా అక్షయ్ కుమార్ కరోనా టైంలో చాలా మందికి సాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కరోనా టైంలో ఇబ్బంది పడుతున్న 1600 మంది జూనియర్ కొరియోగ్రాఫర్లు, వయసుమళ్లిన డ్యాన్సర్లతో పాటుగా రెండు వేల మంది బ్యాగ్రౌండ్ డ్యాన్సర్లకు నెల రేషన్ బియ్యాన్ని అందించనున్నాడు. ఈ సాయం చేయడానికి కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య ఫౌండేషన్ తో కలిసి పనిచేస్తున్నాడు.

ఒక వేళ సాయం వద్దనుకున్నవారు డబ్బులు తీసుకునే అవకాశం కూడా ఈ ఫౌండేషన్ కల్పిస్తోందని చెబుతున్నారు. ఇటువంటి సాయం చాలా మందికి ఆదర్శంగా నిలుస్తోందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా అక్షయ్ కుమార్ పలు సేవా కార్యక్రమాలు చేశారు. గతంలో కూడా దేశం కష్టకాలంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వైరస్ పై కేంద్రం చేస్తోన్న పోరాటానికి మద్దతుగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ భారీ విరాళం ప్రకటించారు. తాను రీల్ హీరోను మాత్రమే కాదు రియల్ హీరోను కూడా అని అనిపించుకున్నాడు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సాయం అందించే సహాయ నిధి పీఎం కేర్స్ ఫండ్‌కి అక్షయ్ కుమార్ ఏకంగా రూ. 25 కోట్ల భారీ విరాళం అందించాడు. ఆ సమయంలో అక్షయ్ కుమార్ చేసిన సాయం చాలా మందికి ఆదర్శంగా నిలిచింది. దీనితో పలువురు ఆయనను ప్రశంసించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: