గోల్డెన్ హీరోయిన్ గా శృతికి లైఫ్ ఇచ్చిన ఆ డైరెక్టర్ ...
ఇక సిద్ధార్థ హీరోగా ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ హౌస్ డిస్నీ నిర్మాణంలో తెరకెక్కిన "అనగనగ ఓ ధీరుడు" ద్వారా చాలా హాట్ గా సౌత్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ సినిమా కూడా నిరాశపరిచింది. ఇక ఆ తరువాత సూర్యతో సెవెన్త్ సెన్స్, తెలుగులో ఓ మై ఫ్రెండ్, ధనుష్ తో త్రీ లాంటి సినిమాలలో నటించి నటిగా గుర్తింపు అయితే తెచ్చుకుంది. కాని అమ్మడికి కమర్షియల్ హీరోయిన్ గా అయితే గుర్తింపు రాలేదు.దాంతో ఈ హాట్ బ్యూటీకి ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది.ఇక శృతి హాసన్ హీరోయిన్ గా పనికిరాదా దుకాణం సర్దుకోవాల్సిందేనా అనే టైంలో ప్రత్యక్ష మయ్యాడు మన హరీష్ శంకర్.
అవకాశాలు లేక పరితపిస్తూ వున్న శృతికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా "గబ్బర్ సింగ్" సినిమాలో అవకాశం ఇచ్చాడు. ఇక అంతే ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో శృతి పాపకి అవకాశాలు క్యూ కట్టాయి. ఆ తరువాత వరుస సినిమాలతో తమిళ తెలుగు నాట పెద్ద స్టార్ హీరోయిన్ అయ్యి భారీ హిట్లు కొడుతూ అభిమానులను సంపాదించుకుంది. అలా శృతికి గబ్బర్ సింగ్ రూపంలో హరీష్ లైఫ్ ఇచ్చాడనే చెప్పాలి.