నీ అంత కొడుకు ఉన్న మహిళ తో డేటింగ్ ఏంటి? అర్జున్ కపూర్ తెలివైన సమాధానం..!!
లేడీ సెలబ్రిటీలను వారి వ్యక్తిత్వం గురించి, వారి పర్సనల్ విషయాల గురించి ఎఫైర్ ల గురించి ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెడుతున్నారు నెటిజన్స్.. మేల్ సెలబ్రిటీలను కూడా అలాంటి ప్రశ్నలు అడుగుతూ వారిని చిరాకు తెప్పిస్తా రు. అయినా కూడా ఎంతో కూల్ గా సమాధానం చెబుతూ తెలివిగా తప్పించుకుంటున్నారు మన సెలబ్రిటీలు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ కపూర్ అభిమానులతో లైవ్ చాట్ చేయగా, పెళ్లయి కొడుకు ఉన్న ఓ మహిళతో సహజీవనం చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్న ఎదురయ్యింది.
దీనికి అర్జున్ జవాబు ఇస్తూ " నా పర్సనల్ విషయాల గురించి నేను ఎక్కువగా మాట్లాడను.. కానీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను.. అదేమిటంటే.. మన భాగస్వామికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. గతం గతం.. దానికి మనం ఏమి చేయలే ము.. ఆమెకు హద్దులు పెట్టడం, ఆమె కోరుకున్న లక్ష్యాన్ని అదుపు చేయడమనేది పెద్ద తప్పు. ఇలా పర్సనల్ విషయాల గురించి మాట్లాడడం వల్ల పిల్లలపై ఎంతో ప్రభావం పడుతుంది. అయితే నేను ఆమె ఫీల్ అయ్యేలా ప్రవర్తించగలను అంటూ చెప్పుకొచ్చాడు.ఇకపోతే అర్జున్ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో పలు ప్రాజెక్ట్ లలో నటిస్తున్నాడు..