రూటు మార్చిన లేడి సూపర్ స్టార్..?

N.ANJI
లేడి సూపర్ స్టార్ నయనతార గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె లేడి ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను మరింత దగ్గరైంది. తమిళం, తెలుగులో దాదాపు అందరు స్టార్‌ హీరోలతో నటించింది ఈ భామ. లేటెస్ట్‌గా తన స్టైల్ మార్చుకొనే పనిలో పడిందట ఆమె. తమిళంలో సూపర్‌హిట్‌గా నిలిచిన సినిమాల సిరీస్ ఏదైనా ఉందంటే.. అది రాఘవ లారెన్స్ రూపొందించిన కాంచన సిరీసే.

ఇక ఈ సిరీస్‌లో వచ్చిన నాలుగు సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. హారర్‌ జోనర్‌లో రూపొందే ఈ సినిమా సిరీస్‌లో అద్భుతమైన కామెడీతో పాటు మంచి సందేశం అందించే ప్రయత్నం చేస్తాడు లారెన్స్‌ దీంతో తమిళంలోనే కాదు.. తెలుగులోనూ కాంచన సిరీస్‌కి మంచి క్రేజ్ ఉంది.

అయితే కాంచన అంత కాకపోయినా దర్శకుడు సుందర్.సి రూపొందించే ‘అరణ్మనై’ సిరీస్‌ కూడా మంచి సక్సెస్ సాధించింది. ఇప్పటికే ఈ సిరీస్‌లో రెండు సినిమాలు వచ్చాయి. త్వరలో మూడో సినిమా కూడా తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రెండు సినిమాల్లో హన్సిక ఆత్మ పాత్రలో నటించగా.. మొదటి సినిమాలో ఆండ్రియా, లక్ష్మీ రాయ్, రెండో భాగంలో త్రిష హీరోయిన్లుగా చేశారు. ఇక మూడో సినిమా ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇందులో ఆండ్రియా ఆత్మగా రాశీ ఖన్నా హీరోయిన్‌గా కనిపించనున్నట్లు టాక్.

ఇక ఈ సినిమా తర్వాత ‘అరణ్మనై-4’ కూడా ప్లాన్ చేస్తున్నరట సుందర్.సి. మూడో సినిమా విడుదల అయిన తర్వాత ఈ సినిమాపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నయనతారను అనుకుంటున్నారట. ఇప్పటికే ఆమెతో దీనిపై చర్చ కూడా జరిపినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా దాదాపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్న నయనతార సరైన హిట్ అందుకోలేదు. దీంతో ఇప్పుడు అరణ్మనైకి నయనతారా ఓకే చెబితే మంచి గుర్తింపు వస్తుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: