సిద్ధ ప్రాముఖ్యత పై కొరటాల ఆసక్తికర కామెంట్స్ !

Seetha Sailaja

కోవిడ్ సెకండ్ వేవ్ పరిస్థితులు అడ్డుతగలకుండా ఉండి ఉంటే ఈపాటికి ‘ఆచార్య’ మూవీ రిలీజ్ అయి ఆ సినిమా ఫలితం కూడ తెలిసిపోయి ఉండేది. అయితే ఊహించని పరిస్థితులతో మెగా అభిమానులకు నిరాశ తప్పలేదు. దీనితో ‘ఆచార్య’ విడుదల ఎప్పుడు అన్న ఆతృతతో అభిమానులు ఉన్నారు.


ఇలాంటి పరిస్థితులలో చిరంజీవి అభిమానులకు జోష్ ను కలిగించే ఒక న్యూస్ ను కొరటాల శివ లీక్ చేసాడు. ‘ఆచార్య’ మూవీ కథ అంతా ఈ మూవీలో చరణ్ పోషిస్తున్న సిద్ధ పాత్ర చుట్టూ తిరుగుతుందని ఈ మూవీలో చిరంజీవి చరణ్ ల మధ్య ఉండే కీలక సన్నివేశాలు అన్నీ సెకండ్ హాఫ్ లో ఉంటాయని శివ లీకులు ఇచ్చాడు.


ఇదే సందర్భంలో ఈమూవీ పెండింగ్ షూటింగ్ గురించి మాట్లాడుతూ సుమారు 10 రోజుల పెండింగ్ షూటింగ్ మాత్రమే ఈ సినిమాకు సంబంధించి బ్యాలెస్స్ ఉందని మిగతా షూటింగ్ అంతా పూర్తి అయిపోయిందని కొరటాల అంటున్నాడు. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు సద్దుమణిగిన వెంటనే ‘ఆచార్య’ షూటింగ్ ను మొదలుపెట్టడానికి అంతా సిద్ధంగా ఉన్నారు అంటూ కొరటాల మెగా అభిమానులకు జోష్ ను కలిగిస్తున్నాడు.


ఇక ఈమూవీకి సంబంధించి పూజా హెగ్డే చరణ్ లపై చిత్రీకరించిన ‘నీలాంబరి’ పాటకు సంబంధించిన కొన్ని స్టిల్స్ ను త్వరలో విడుదల చేయబోతున్నట్లు కొరటాల చెప్పిన మాటలతో అప్పుడే ‘ఆచార్య’ విడుదల అయిపోయినంత ఆనందాన్ని మెగా అభిమానులు పొందుతున్నారు. వాస్తవానికి ఈమూవీని ‘పుష్ప’ రిలీజ్ చేయాలి అనుకున్న ఆగష్టు 13వ తేదీన విడుదలకు లైన్ క్లియర్ అవుతున్నప్పటికీ ఈ మూవీని తిరిగి ధియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీ నిబంధనలు తిరిగి ప్రవేశ పెట్టేవరకు విడుదల చేయడం శ్రేయస్కరం కాదని ఈ మూవీ నిర్మాతల భావన అని అంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో షూటింగ్ అంతా పూర్తి అయిపోయిన ‘ఆచార్య’ ను ఇంకా ఎంతకాలం హోల్డ్ లో పెట్టాలి అన్న విషయమై కొరటాల శివ తెగ కన్ఫ్యూజ్ అవుతున్నట్లు టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: